వెంకీ మామ మొదలు పెట్టేది ఈరోజే.. మేనల్లుడితో సందడి!
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలసి నటించబోయే వెంకీ మామ చిత్రం ఆసక్తి రేపుతోంది. వెంకటేష్ నుంచి రాబోతున్న మరో మల్టీస్టారర్ చిత్రం ఇది. జైలవకుశ చిత్ర దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. చాలా కాలం క్రితమే ఈ చిత్రం లాంచ్ అయింది. కాగా ఎట్టకేలకు నేడు సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్ ఇప్పటికే ఎఫ్2 అనే మల్టీస్టారర్ చిత్రంలో వరుణ్ తేజ్ తో నటిస్తున్నాడు. ఇప్పుడు తన మేనల్లుడు నాగ చైతన్యతో కలసి నటిస్తుండడంతో ఉత్కంఠగా మారింది. వెంకటేష్ సరసన హ్యూమా క్యురేష్, నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మొదటి షెడ్యూల్ లో వెంకీ, చైతన్యపై కీలక సన్నివేశాల్లో చిత్రీకరించనున్నారు. కోన వెంకట్ ఈ చిత్రాన్ని రచయిత. త్వరలో మరిన్ని విశేషాలు తెలియనున్నాయి. ఎఫ్2 చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











