twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్టరీ వెంకటేష్ 32 ఇయర్స్ ఇండస్ట్రీ.. నటుడిగా పుట్టింది ఈరోజే!

    |

    విక్టరీ వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై నేటికి సరిగ్గా 32 ఏళ్ళు. వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు 1986 ఆగష్టు 14 న విడుదలైంది. ఆ మధుర జ్ఞాపకాన్ని వెంకటేష్ గుర్తు చేసుకున్నారు. నటుడిగా నాకు నేడే పుట్టిన రోజు అని వెంకీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

    32 ఏళ్ల తన సినీ ప్రయాణంలో ఆడియన్స్ తనని ఎంతగానో ఆదరించారని వెంకీ తెలిపాడు. సొంత బ్యానర్ లో తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తరువాత వెంకీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తక్కువ సమయంలో వెంకీ టాలీవుడ్ లో స్టార్ గా మారిపోయాడు.

    Victory Venkatesh completes 32 years in TFI

    ఓ దశలో వెంకీ సినిమా వస్తుందట ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్స్ ముందు క్యూ కట్టేవారు. వెంకీ నటన అంత గొప్పగా ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైంది. ప్రస్తుతం వెంకీ విభిన్న పాత్రలతో, మల్టీస్టారర్ చిత్రాలతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కలియగు పాండవులు చిత్రంతోనే అందాల తార ఖుష్బూ హీరోయిన్ గా పరిచయం అయింది.

    English summary
    Victory Venkatesh completes 32 years in TFI. 32 years for Kaliyuga Pandavulu movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X