వెంకీమామ షూటింగ్ ప్రారంభం ఎప్పటి నుంచి అంటే!

విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు అక్కినేని నాగ చైతన్యతో కలసి నటించబోయే చిత్రం వెంకీ మామ. ఎఫ్2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకటేష్ నుంచి రాబోతున్న మరో మల్టీస్టారర్ చిత్రం ఇది.ఎఫ్ 2లో వెంకీ చాలారోజులుగా దూరమవుతూ వస్తున్న కామెడీతో చెలరేగిపోయాడు. వసూళ్ళలో ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. అదే హుషారులో వెంకీ మామ చిత్రంలో నటించేందుకు వెంకటేష్ సిద్ధం అవుతున్నాడు.

జైలవకుశ చిత్ర దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. చాలా కాలం క్రితమే ఈ చిత్రం లాంచ్ అయింది. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ డేట్ ని ఖరారు చేసుకుంది. ఫిబ్రవరి 21న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, కోన వెంకట్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

Victory Venkatesh and Naga chaitanya Multistarrer movie Venky Mama will go floors from this date

ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఎంపికైంది. సరదా అంశాలతో దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. మామ అల్లుళ్ళు కలసి నటించబోతుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X