నారప్ప తరువాత ఆ దర్శకుడితోనే వెంకీ న్యూ మూవీ.. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. F2 ముందు వరకు వరుసగా అపజయాలు ఎదుర్కొన్న ఈ దగ్గుబాటి హీరో మొత్తానికి తన ట్రాక్ రికార్డ్ ని సెట్ చేసుకున్నాడు. వెంకీ మామకు కూడా మంచి ఓపెనింగ్స్ అందుకోవడంతో నెక్స్ట్ సినిమాలతో మరింత హార్డ్ వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
త్వరలో రిలీక్ కానున్న ఆ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే నారప్ప అనంతరం వెంకటేష్ చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు మల్టీస్టారర్ కథలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఈ దగ్గుబాటి హీరో ఏ దర్శకుడితో వర్క్ చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న వెంకీ ఆ సినిమాను గత ఏడాదిలోనే స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఇక త్రినాధ రావు నక్కినతో కూడా గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు.
అయితే ఫైనల్ గా ఈ రెండు సినిమాలలో ముందు త్రినాథరావు నక్కిన సినిమాతోనే రానున్నారట వెంకీ. కథలో ఫుల్ కామెడీ ఉండడంతో నారప్ప తరువాత ఆడియెన్స్ కి కొత్తగా ఉండాలని ఆ సినిమా ఒకే చేశాడట. కుదిరితే రెండు ఒకేసారి ఫినిష్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా వెంకీ ఒక సినిమా చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











