మూడు సినిమాలతో రచ్చ చేయబోతున్నాడు.. 2018 ఖాళీ!
విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండే క్రేజే వేరు. వెంకీ చిత్రాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ చెవి కోసుకుంటారు. కెరీర్ ఆరంభం నుంచి మాస్ చిత్రాలని, ఫ్యామిలీ చిత్రాలని వెంకీ బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వెంకీ మనసు మల్టీస్టారర్ చిత్రాలపై పడ్డట్లు తెలుస్తోంది. వరుసపెట్టి మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నాడు.
వెంకీ క్యాలెండర్ లో 2018 సంవత్సరం ఖాళీగా మారిపోనుంది. ఈ ఏడాది వెంకీ నుంచి ఒక్క చిత్రం కూడా రాలేదు. కానీ వచ్చే ఏడాది మాత్రం వెంకీ వరుస చిత్రాలతో మోత మోగించబోతున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు.

ఇక జైలవకుశ దర్శకుడు బాబీ దర్శత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించబోతున్నారు. ఈ చిత్ర టైటిల్ వెంకీ మామ. ఈ రెండు మల్టీస్టారర్ చిత్రాలు. ఇక వెంకీ సోలో హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శత్వంలో ఓ చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు చిత్రాలు 2019 లో విడుదల కాబోతున్నాయనేది లేటెస్ట్ టాక్.


Click it and Unblock the Notifications











