Nani హాయ్ నాన్నకు ఆమె ఓ మ్యాజిక్.. కలెక్షన్లు ఎవడికి కావాలి? నాని సంచలన వ్యాఖ్యలు
నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ థాకూర్ జంటగా బాలనటి కియారా ఖన్నా నటించిన హాయ్ నాన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. నూతన దర్శకుడు శౌర్యు దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఓవర్సీస్‌తోపాటు విడుదలైన ప్రతీ చోట భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా నాని ఎమోషనల్‌గా మాట్లాడారు. నాని ఏం మాట్లాడారనే వివరాల్లోకి వెళితే..

హాయ్ నాన్న సక్సెస్ మీట్‌కు మృణాల్ హాజరుకాలేకపోయింది. తాను ఈ ఫంక్షన్‌లో లేకపోవడంపై బాధపడుతున్నది. నిజంగా ఆమె లేకుండా ఈ మీట్ జరుపుకోవడం బాధగా ఉంది. నేను న్యూయార్క్‌లో ఆమెను కలిశాను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మనందరికి ఓ పార్టీ ఇస్తానని ప్రామిస్ చేసింది అని నాని అన్నారు.

హాయ్ నాన్న సినిమాకు మహీ పాత్ర కీలకం. ఆ పాత్రలో కియారా ఖన్నా అద్బుతంగా నటించింది. కియారా లేకుంటే ఈ సినిమా లేదు. మహీ బంగారం.. ఐ లవ్ యూ. ఈ సినిమాకు అందరి కంటే ఎక్కువగా కియారా కష్టపడింది. ఈ సినిమాకు ఓ మ్యాజిక్ కియారా అని నాని అన్నారు.


Click it and Unblock the Notifications











