twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్ డౌన్ ఎఫెక్ట్.. నిర్మాతలకు రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన స్టార్ హీరో!

    |

    లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమలకు తీరని నష్టం కలుగుతోంది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఆ ప్రభావం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలపైనే పడింది. ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా సినిమాలు ఆగిపోవడంతో లక్షల కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. ఇక నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. సినిమా అనుకున్న సమయనికి రిలీజ్ కాకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    అందుకే హీరోలతో పాటు ఇతర టెక్నీషియన్స్ వారి రెమ్యునరేషన్ తగ్గించి నిర్మాతలకు అండగా నిలవాలని సినీ పెద్దలు కోరుతున్నారు. అయితే సహాయం చేయడానికి మొదటగా వచ్చిన హీరో మాత్రం విజయ్ ఆంటోనీ. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన విజయ్ ఆ తరువాత చిన్న బడ్జెట్ సినిమాలు చేసి హీరోగా క్లిక్కయ్యారు. ఇక ఇప్పుడు మూడు మీడియం బడ్జెట్ సినిమాలు సెట్స్ పై ఉండగా నష్టపోతున్న తన నిర్మాతలకు అండగా ఉండేదుకు సిద్ధమయ్యాడు.

    Vijay antony has decided to take a pay cut for three films

    సినిమాలకు సైన్ చేసి లాక్ డౌన్ కంటే ముందే రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్ ఆంటోనీ ఇప్పుడు వారికి సగానికి పైగా డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశాడట. విజయ్ చేసిన పనికి తమిళ నిర్మాతలతో పాటు మిగతా ఇండస్ట్రీల నుంచి కూడా నిర్మాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి హీరోలు ఉంటే నిర్మాతలకు చాలా ధైర్యంగా సినిమాలు చేయగలరని తమిళ్ సినీ ప్రముఖులు చెబుతున్నారు.

    English summary
    Vijay Antony always does some crazy films in his career and he has some release or the other lined up. He is doing three Tamil films as of now and seeing the crazy losses the filmmakers are going through because of the lockdown, he has taken a crazy decision
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X