అప్పట్లో 50లక్షలకు 14కోట్లు తెచ్చిపెట్టిన సినిమా.. ఇప్పుడు మరో సీక్వెల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలను అందించిన డబ్బింగ్ సినిమాల్లో బిచ్చగాడు ఒకటి. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా తమిళ్ లో పిచాయిక్కరన్ గా విడుదల అయ్యింది. మొదట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

బెస్ట్ మదర్ సెంటిమెంట్..
మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా పెద్దగా హడావుడి లేకుండానే రిలీజ్ అయ్యింది. తెలుగులో అప్పట్లో వెంకటేష్ తో శీను సినిమాను డైరెక్ట్ చేసిన శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా తక్కువ బడ్జెట్ లో తెరక్కెకించిన ఈ సినిమా తమిళ్ లో సంచలన విజయాన్ని అందుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో హీరోగా కొనసాగారు.

తెలుగులో కూడా హిట్టే
2016లో వచ్చిన ఈ సినిమా తెలుగు రైట్స్ కేవలం 50లక్షలు మాత్రమే. స్టార్ ఇమేజ్ లేని డబ్బింగ్ సినిమాకు ఆ ధర కూడా ఎక్కువే అని అంతా అనుకున్నారు. కానీ రిలీజ్ అనంతరం ఆ సినిమా కలెక్షన్స్ ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. రజినీకాంత్ తప్పితే అప్పట్లో ఏ తమిళ్ హీరో కూడా సాధించలేని కలెక్షన్స్ ని ఆ సినిమాతో సాధించాడు విజయ్ ఆంటోనీ.

కోట్లల్లో లాభాలు..
50లక్షలు పెట్టి రైట్స్ అందుకున్న బయ్యర్ కి ఈ సినిమా వీకెండ్ అనంతరం కాసుల వర్షం కురిపించింది. ప్రమోషన్స్ లేకుండానే మాస్ ఆడియెన్స్ పాజిటివ్ టాక్ తో సినిమాను ఒకటికి రెండు సార్లు చూశారు. బిచ్చగాడు తెలుగులో 14కోట్లకు పైగా లాభాలను అందించడంతో నిర్మాత లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.

హిట్టు సినిమాకు సీక్వెల్..
అయితే సర్ ప్రైజ్ హిట్ అందుకున్న ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరోగా మారీన విజయ్ ఆంటోనీ బిచ్చగాడు తరువాత తెలుగులో మళ్ళీ సక్సెస్ అందుకోలేదు. దీంతో ఈ సారి హిట్టు సినిమాతో సీక్వెల్ అందుకోవాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











