తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఫిదా.. ‘బిచ్చగాడు 2’పై విజయ్ ఆంటోని
తెలుగు ప్రేక్షకులు ఓ చిత్రాన్ని నెత్తిన పెట్టుకోవాలంటే వారు స్టార్ ఫ్యామిలీ నుంచే రావాల్సిన పని లేదు. ఒక మంచి కథ, అందరినీ కదలించే, మెప్పించే చిత్రం వస్తే చాలు దాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. కనీసం అది డబ్బింగ్ సినిమానా? అని కూడా చూడరు. అందుకే తమిళ హీరోలే అయినప్పటికీ రజినీ, విక్రమ్, సూర్య, విశాల్ వంటివారి సినిమాలను ఎంతగానో ఆరాధస్తారు. ఈ క్రమంలోనే బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నిసొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని.
విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే మళ్లీ ఆరేంజ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఇంద్రసేన, రోషగాడు అంటూ ఏవేవో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని బిచ్చగాడు సీక్వెల్‌ను రెడీ చేస్తున్నాడు. ఈ నెల 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా బిచ్చగాడు 2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు.

ఇక ఫస్ట్ లుక్‌పై టాలీవుడ్‌లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఫస్ట్ లుక్‌పై చూపించిన ప్రేమ, పుట్టిన రోజు విష్ చేయడం.. వంటివి చూసి తెలుగు ప్రేక్షకుల ప్రేమకు విజయ్ ఫిదా అయ్యాడు. అందుకే తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి తెలుగులోనే ట్వీట్ చేశాడు. 'ఫ్రెండ్స్...మీరు నా పై చూపుతున్న ప్రేమ - అభిమానం చాలా అమూల్యమైనది. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాళ్లందరికి పేరు పేరున నా కృతఙ్ఞతలు బిచ్చగాడు2 కి బాట వేసిన నా మిత్రుడు,దర్శకుడు శశి గారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు' అని టాలీవుడ్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు.



Click it and Unblock the Notifications











