అభిమానుల ఎఫెక్ట్.. విజయ్ సినిమా లొకేషన్ చేంజ్!
ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతమ్ అట్లీ దర్శత్వంలో ఫుట్ బాల్ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. విజయ్ కి ఉన్న క్రేజ్ వలన ఎక్కడ షూటింగ్ కు వెళ్లినా చిక్కులు తప్పడం లేదు. విజయ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వస్తుండడంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడుతోంది.
ఇటీవల ఓ కళాశాలలో షూటింగ్ జరుగుతుండగా విజయ్ ని చూసేందుకు అభిమానులు ఏకంగా ఇనుప కంచెనే విరిచేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విజయ్ ప్రయాణిస్తున్న కారుని కూడా ఫ్యాన్స్ వెంబడిస్తున్నారు. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని చిత్ర యూనిట్ తాజాగా షూటింగ్ లొకేషన్ నే మార్చేసింది.

చెన్నైలోని బిన్నీమిల్స్ లో షూటింగ్ జరుగుతుండగా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానుల వలన చిత్రీకరణ సాధ్యం కాకపోవడంతో షూటింగ్ ని హార్బర్ కు మార్చినట్లు తెలుస్తోంది. అక్కడికి కూడా అభిమానులు వస్తుండడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. కానీ విజయ్ అభిమానులు అసంతృప్తితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











