యూరప్‌పై ప్రేమ.. రౌడీ బాయ్ న్యూ లుక్ వైరల్
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మన హీరోలకు కొన్ని స్పెషల్ వెకేషన్స్ ఉంటాయి. ఒక్కో హీరోకు ఒక్కే ప్లేస్ అంటే ఇష్టముంటుంది. అలా విజయ్ దేవరకొండ యూరప్‌పై ప్రేమను పెంచుకున్నట్టు తెలుస్తోంది. అలా విదేశాల్లో అయితే ఎంచక్కా స్వేచ్చగా తిరిగేయోచ్చు. ఎవరితోనూ ఇబ్బంది ఉండదు రెస్టారెంట్‌లకు, షాపింగ్‌లకు వెళ్లొచ్చు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా అదే మూడ్‌లో ఉన్నట్టున్నాడు.
విజయ్ దేవరకొండ ఈ మధ్యే తన అమ్మ 50వ బర్త్ డే సందర్భంగా ఓ క్యూట్ వీడియోను షేర్ చేశాడు. క్రికెట్‌లో హాఫ్ సెంచరీ కొడితే ఎలా సిగ్నేచర్ మూమెంట్ పెడతారో అలా బ్యాట్ ఎత్తి చూపించారు. ఎంతైనా దేవరకొండ ఫ్యామిలీ వెరైటీ అని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టారు. తాజాగా విజయ్ ఓ ఫోటోను షేర్ చేస్తూ తన మనసులోని భావాలను తెలిపాడు. నచ్చిన దేశంపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

యూరోప్ గురించి చెబుతూ విజయ్ అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. పని చేసి చేసి పిచ్చెక్కిపోయినప్పుడు.. నటుడిని కావడం వల్ల ఉండే కొన్ని అసౌకర్యాల నుంచి తప్పించుకునేందుకు, మరీ ముఖ్యంగా అక్కడే దొరికే అద్భుతమైన ఫుడ్ కోసం అక్కడి వెళ్లాలని అనిపిస్తోంది యూరోప్ గురించి విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా విజయ్ షేర్ చేసిన పిక్‌లో ఆ హెయిర్ స్టైల్, ఆ లుక్, స్మైల్ అన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ కాంబోలో రాబోతోన్న తన తదుపరి చిత్రం గురించి విజయ్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











