దటీజ్ విజయ్ దేవరకొండ.. పోటీగా స్టార్ హీరోలున్నా బెదరకుండా.. చెప్పి మరీ కొట్టాడుగా!
టాలీవుడ్ రౌడి స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రతి ఏడాది తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటూ వెళుతున్నాడు. ఎంతో కష్టపడి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు వచ్చిన విజయ్ ఇటీవల మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అలాగే తన మీద తనకున్న నమ్మకాన్ని కూడా ఒక్క మాటలో అర్థమయ్యేలా చేశాడు.

చిన్న చిన్న పాత్రల్లోనే..
విజయ్ దేవరకొండ కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మొదట హీరో అవ్వాలనలనే గొప్ప ఆశయంతో వచ్చినప్పటికీ మొదట చిన్న చిన్న పాత్రల్లోనే నటించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా నలుగురికి తానేంటో పరిచయం అయ్యాడు. సపోర్టింగ్ రోల్స్ తో కూడా సినిమాలకు బాగా హెల్ప్ అయ్యాడు.

విజయ్ కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది
హీరో అవ్వకముందు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చేసిన రిషి పాత్రతోనే విజయ్ కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఇక ఆ తరువాత మంచి స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్న తరువాత కూడా మహానటి సినిమాలో ఒక సపోర్టింగ్ పాత్రలో నటించి మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు. యాక్టింగ్ కోసం వందశాతం హార్డ్ వర్క్ చేయగల ఈ యాక్టర్ కు అభిమానులు సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.

చెప్పి మరి కొట్టాడు
2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్ సొంతం చేసుకోవడంతో సోషల్ మీడియాలో మరోసారి విజయ్ దేవరకొండ పేరు ట్రెండింగ్ లిస్ట్ లోకి చేరిపోయింది. అయితే ఈ టైటిల్ వచ్చే ఏడాది కూడా తనకే అంటూ విజయ్ గత ఏడాదిలోనే క్లారిటీ ఇవ్వడం విశేషం దీంతో చెప్పి కొట్టాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video

అగ్ర హీరోలు పోటీగా ఉన్నా..
అగ్ర హీరోలు పోటీగా ఉన్నా కూడా విజయ్ కాన్ఫిడెన్స్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక రానున్న రోజుల్లో విజయ్ అంతకుమించి అనేలా పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆ సినిమా అనంతరం సుకుమార్ తో మరొక సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











