రిస్క్ ఉంటుంది, నాలాంటి వారు కొందరే: వారసత్వ హీరోలపై విజయ్ దేవరకొండ కామెంట్!

Recommended Video

Vijay Devarakonda Talks About Big Heroes

సినిమా రంగంలో ప్రస్తుతం అంతా వారసత్వ హీరోలదే హవా. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ పరిశ్రమ తీసుకున్నా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుండి వచ్చిన వారే ఎక్కువ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకున్న వారు చాలా తక్కువే అని చెప్పొచ్చు. అలాంటి అదృష్ట వంతులను వేళ్ల మీద లెక్కించవచ్చు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో అలా లక్కీగా ఎదిగిన యాక్టర్లలో విజయ్ దేవరకొండను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న ఈ హీరో ఈ నెల 5న 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

వారసత్వ హీరోలపై విజయ్ తెలివిగా..

వారసత్వ హీరోలపై విజయ్ తెలివిగా..

'నోటా' సినిమా ప్రమోషన్లలో భాగంగా వివిధ మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొనంటున్న విజయ్ దేవరకొండకు వారసత్వ హీరోల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ విషయంలో విజయ్ చాలా తెలివిగా... ఎవరూ నొచ్చుకోకుండా, కన్విన్సింగ్‌గా సమాధానం ఇవ్వడం గమనార్హం.

వారసత్వ హీరోలకు అది ప్లస్ పాయింట్

వారసత్వ హీరోలకు అది ప్లస్ పాయింట్

సినిమా అంటే కేవలం కళ మాత్రమే కాదు. ఇది డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వ్యాపారం. డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసే నిర్మాత దాన్ని ఎలా రాబట్టుకోవాలో ముందే ఒక లెక్కలు వేసుకుని రంగంలోకి దిగుతారు. వారసత్వ హీరోలైతే ఆల్రెడీ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సేఫ్ జోన్‌గా భావిస్తారు. కొత్తవారితో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉండటం అనేది వారసత్వ హీరోలకు ప్లస్ పాయింట్ అని విజయ్ దేవరకొండ అన్నారు.

నా లాంటి అదృష్ట వంతులు కొందరే...

నా లాంటి అదృష్ట వంతులు కొందరే...

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఒక సంవత్సరంలో తన లాంటి ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.

ఇక్కడ అవకాశం కొందరికే...

ఇక్కడ అవకాశం కొందరికే...

సినిమా ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశం దొరకడమే చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో సక్సెస్ అయ్యేవారు ఇంకా తక్కువ. ఇతర రంగాల్లో అయితే ఇలా ఉండదు. ఎక్కువ మందికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అని విజయ్ తెలిపారు.

నోటా అందరికీ నచ్చుతుంది

నోటా అందరికీ నచ్చుతుంది

నోటా సినిమా అందరికీ నచ్చుతుంది. మీరు ఇప్పటి వరకు చూసిన పొలిటికల్ డ్రామాలకు భిన్నమైన సినిమా ఇది. ప్రతి ఒక్కరిలోనూ రాజకీయాల గురించి అవగాహన పెంచుతుంది అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

 నోటా

నోటా

‘నోటా' చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X