45 ఏళ్ళు వచ్చాకే ఆ రహస్యం బయటకు.. నాన్న తిట్టినప్పుడే చెప్పేశా.. విజయ్ దేవరకొండ!
విజయ్ దేవర కొండ ప్రస్తుతం టాలీవుడ్ లో మోత మోగిపోతున్న పేరు ఇది. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ నయా స్టార్ గా మారిపోయాడు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి చిత్రాలతో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న నోటా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు.
తమిళ భాష రాకుండా తమిళ చిత్రంలో నటించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని నోటా చిత్రంతో ఎలాగోలా అధికమించానని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పే సమయంలో ఓ పద్ధతి అవలంభించానని దానివల్లనే సులువుగా డబ్బింగ్ పూర్తి చేసానని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఆ పద్ధతి ఏంటో తనకు 45 ఏళ్ళు వచ్చిన తరువాతే వెల్లడిస్తానని తెలపడం విశేషం.

నటనలోకి రాకముందు సంగతులని వివరిస్తూ.. డిగ్రీ చదివే సమయంలో ఇంట్లో కూర్చుని టివి చూస్తున్నా. నాన్న అప్పుడే వచ్చి ఎందుకు నా డబ్బు వృధా చేస్తున్నావు. ఇంటికి పనికొచ్చే పని ఏదైనా చేయి అని అరిచారు. నాకు కోపం వచ్చి.. నాకు యాక్టర్ కావాలని ఉంది.. ఏదైనా యాక్టింగ్ స్కూల్ లో చేర్పించండి అని చెప్పేశా. మా ఇంటికి దగ్గర్లోని ఓ యాక్టింగ్ స్కూల్ లో చేర్పించారు. అక్కడి నుంచే నటుడిగా నా ప్రయాణం మొదలైందని విజయ్ దేవరకొండ తెలిపాడు.


Click it and Unblock the Notifications











