అలాంటి వారిని నిద్ర పోనివ్వకండి.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్

కొన్ని సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా మనసుకు దగ్గరవుతాయి. వాటికి కమర్షియాలిటీనీ జోడించి బాక్సాఫీస్ లెక్కలను ఆపాదించలేం. అలాంటి వాటిలో డియర్ కామ్రేడ్ ఒకటి. మిశ్రమ ఫలితం వచ్చినా.. తన కెరీర్‌లో నిలిచేపోయే చిత్రమిదేనని విజయ్ దేవరకొండ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా వెండితెరపై అంతగా సక్సెస్ కాకపోయినా.. బుల్లితెరపై మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది. డియర్ కామ్రేడ్ చిత్రం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా.. విజయ్ ఎమోషనల్ అయ్యాడు.

'డియర్ కామ్రేడ్ విషయంలో నాకెన్నో అనుభూతులున్నాయి. ఒక్క మాటలో వాటన్నంటిని వివరించడం చాలా కష్టం. ఒకవేళ నాకు ఈరోజు మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశాన్ని ఇస్తే.. మళ్లీ నా వాళ్లందరినీ కలుస్తా. మళ్లీ సినిమాను తీస్తా. ఈ సినిమాతో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా రిలీజైన సందర్భంలో జరిగిన సంఘటనలతో ఇలాంటి ఓ రోజు వస్తుందని, ఇలా మాట్లాడతానని నాకు తెలుసు.

 Vijay Devarakonda About One Year Of Dear Comrade

లిల్లీ, బాబీ లాంటి ఫైటర్స్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుందాం. ఈ సినిమా కథ, కథనాన్ని సెలెబ్రేట్ చేసుకుందాం. అద్భుతమైన సంగీతాన్ని సెలెబ్రేట్ చేసుకుందాం. ఈ సినిమాలోని ఆత్మను సెలెబ్రేట్ చేసుకుందాం. మనందరి కోసం ఓ ఆలోచనను వదిలి వెళ్తున్నా.. కలలు కనండి.. పెద్ద కలలు కనండి.. ఒకవేళ కలలు కనకుండా ఎవ్వరైనా అడ్డుపడితే.. అలాంటి వారిని మీరు నిద్రపోనివ్వకండి' అని విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.

 Vijay Devarakonda About One Year Of Dear Comrade

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X