Liger కంటే ముందే కరణ్ జోహార్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఏం జరిగిందంటే?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి లైగర్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు అనిపిస్తోంది. ఎందుకంటే లైగర్ కు నార్త్ ఇండస్ట్రీలో కూడా విడుదలకు ముందే మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్ర యూనిట్ ఎక్కడికి వెళ్లినా కూడా జనాలు భారీ స్థాయిలోనే మద్దతు పలుకుతూ ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రెస్ మీట్స్ లో కూడా కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలియజేస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో కరణ్ జోహార్ ఆఫర్ కూడా రిజెక్ట్ చేసినట్లుగా విజయ్ తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నార్త్ లో కూడా..
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కలయికలో వస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లైగర్ పై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఈ సినిమా పై నార్త్ ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహిస్తున్న స్పెషల్ ఈవెంట్స్ కు కూడా భారీ సంఖ్యలోనే అభిమానులు పాల్గొంటూ ఉండడం విశేషం.

ఆ రేంజ్ లో రెస్పాన్స్
లైగర్ కు వస్తున్న రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంది అంటే.. ప్రత్యేకంగా ఫ్యాన్స్ మీట్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులకు మళ్ళీ ఈవెంట్స్ ను క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అధిక సంఖ్యలో జనాలు హాజరవుతూ ఉన్నారు. ఆ విధంగా అభిమానులు విజయ్ దేవరకొండ ను చూసేందుకు ఎగబడుతున్నారు. దీన్నిబట్టి లైగర్ సినిమాకు నార్త్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కరణ్ జోహార్ ఆఫర్ రిజెక్ట్
ఇక లైగర్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూనే సవనిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే నిర్మాత కరణ్ జోహార్ కూడా మరో నిర్మాతగా కొనసాగుతున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాకు భారీ స్థాయిలో హైప్ రావడానికి కూడా కరన్ జోహార్ ఒక ముఖ్య కారణం. అయితే ఇదివరకే విజయ్ దేవరకొండ తో కరణ్ జోహార్ ఒక సినిమా చేయాలని అనుకున్నప్పుడు అతను రిజెక్ట్ చేసినట్లుగా చెప్పాడు.

అందుకే రిజెక్ట్ చేశాను
విజయ్ దేవరకొండ ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ బాలీవుడ్ సినిమా కోసం ఆఫర్ చేసినప్పుడు రిజెక్ట్ చేసినట్లుగా తెలియజేశాడు. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత కరణ్ జోహార్ తనతో మొదటి బాలీవుడ్ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ అప్పుడు నేను బాలీవుడ్ డెబ్యూకి ఇంకా సిద్ధంగా లేను. అందుకే ఆ ఆఫర్ను రిజెక్ట్ చేశాను.. అని విజయ్ దేవరకొండ తెలియజేశాడు.

లైగర్ కోసం సపోర్ట్
బాలీవుడ్ లో మంచి అవకాశం ఇస్తానని అన్నప్పటికీ కూడా నేను ఆఫర్ రిజెక్ట్ చేయడంతో కరణ్ జోహార్ ఏమాత్రం అసంతృప్తి చెందలేదు. ఆ తర్వాత లైగర్ విషయానికి వచ్చేసరికి ఆయనను కలవగానే మద్దతుగా నిలిచారు. ప్రతీ విషయంలో సపోర్ట్ చేశారు. దీన్నిబట్టి ఆయన ఎలాంటి వారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో లైగర్ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుండడానికి ముఖ్య కారణం ఆయనే అని కూడా విజయ్ దేవరకొండ పాజిటివ్ గా స్పందించాడు.


Click it and Unblock the Notifications











