మరోసారి రచ్చ రేపిన విజయ్ దేవరకొండ.. కాళ్ళ మీద కూర్చుని రష్మిక మందన్నకు ప్రపోజ్!
టాలీవుడ్ అనే కాదు దాదాపు అన్ని బాషల సినిమా ఇండస్ట్రీలలో కొన్ని జంటలకు ఎక్కువగా హైప్ వస్తుంది. అది వారి మధ్య ఏర్పడిన కెమిస్ట్రీ వలన ఇలా అవుతూ ఉంటుంది. అలా తెలుగులో క్రేజీ పెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ - రష్మికల గురించి ఎప్పుడూ ఏదో ఒక అంశం వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది.. తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక కి సంబంధించిన మరో అంశం ఇప్పుడు తెరమీదకు వచ్చింది. విజయ్ దేవరకొండ మోకాళ్ళ మీద కూర్చుని రష్మికకి ప్రపోజ్ చేస్తున్న ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హాట్ హాట్‌గా సినీ హీరోయిన్లు.. స్థూలకాయం నుంచి సన్నజాజిలా మారిన భామల (ఫోటోలు)

సంతూర్ సోప్ కోసమె ప్రపోజల్
అయితే విజయ్ దేవరకొండ రష్మిక కు ప్రపోజ్ చేయడం ఏమిటి అనే అనుమానాలు అందరికీ మొదలవచ్చు. అవును మీ అనుమానం నిజమే, ఇది నిజంగా కాదు. సంతూర్ సోప్ కోసం ఒక టీవీ కమర్షియల్ రూపొందిస్తున్నారు. అందులో వీరిద్దరూ నటిస్తున్నారు. ఆ షూట్ లో భాగంగా విజయ్ దేవరకొండ తన మోకాళ్ళ మీద కూర్చుని రష్మికకు ప్రపోజ్ చేస్తున్నట్లు ఈ టీవీ కమర్షియల్ యాడ్ రూపొందుతోంది.
అయితే అలా ప్రపోజ్ చేస్తున్న సమయంలో చిన్న వీడియో రికార్డ్ చేసి యాడ్ ను రూపొందిస్తున్న కంపెనీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. సంతూర్ కోసం కొత్త ఫేసెస్ ని రంగంలోకి దింపుతున్నామని అని పేర్కొంటూ విజయ్ దేవరకొండ రష్మికలను ఆ వీడియోలో చూపించారు. ఇద్దరు కలిసి ఇ ఈ మధ్యనే ఈటీవీ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.
అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

విజయ్ దేవరకొండ - రష్మిక ఇద్దరూ ప్రేమలో
అయితే గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాలో ఉన్న ముద్దుసీను వలన రక్షిత్ శెట్టితో రష్మిక మందన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని విజయ్ దేవరకొండ - రష్మిక ఇద్దరు ప్రేమలో పడ్డారని అప్పట్లో రూమర్లు సైతం వినిపించాయి. కనీసం వీటిని ఖండించని కూడా ఖండించని ఈ జోడీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తుంటే రష్మిక కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తోంది. అలానే ఆమెకు బాలీవుడ్ లో కూడా మచి ఆఫర్స్ లభించాయి.
సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

ముంబైలో రచ్చ చేసేశారు
సరిగ్గా ఒక నెల రోజుల క్రితం వీరిద్దరూ ముంబైలో కలిసి కనిపించగానే రకరకాల ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంకేముంది వీరి ప్రేమ మళ్ళీ పట్టాలెక్కింది అని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారు అంటూ పలు రకాల వెబ్ సైట్స్ కథనాలు వండి వార్చాయి కూడా. నిజానికి వీరిద్దరూ ముందే వేరు వేరు సినిమాలో షూటింగ్స్ కోసం ముంబై వెళ్లారు.
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అలాగే రష్మిక కూడా సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను అనే సినిమాలో నటిస్తోంది. వీరిద్దరూ వేరువేరు పనుల మీద ముంబయి వచ్చి సరదాగా కలుసుకుంటే అప్పుడే రచ్చ చేసేశారు.

నాలుగు చేతులా సంపాదిస్తున్న విజయ్
ఇక ఇప్పుడు ఈ టీవీ కమర్షియల్ బయటకు రావడంతో బహుశా ఇస్ కమర్షియల్ యాడ్ షూటింగ్ కోసమే వీరిద్దరూ కలిసి ఉండొచ్చు అని ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సినిమాలు నిర్మిస్తూ ఆయన బిజీ బిజీగా ఉన్నాడు. అలానే ఇలా కమర్షియల్స్ లో కూడా నటిస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక తాజా వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











