మరో రికార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ స్థానానికి పోటీగా!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోల స్థానాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. బాక్సాఫీస్ మార్కెట్ పరంగా ఒక్కొక్కరు ఒక్కో ఒక్కో విధంగా వారి సత్తాను చాటుకుంటున్నారు. ప్రస్తుత పాన్ ఇండియా మార్కెట్ కోసం యువ హీరోలు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక వారికి ఇంటర్నెట్ వరల్డ్ లో కూడా ఫాలోయింగ్ అయితే గట్టిగానే ఏర్పడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మన స్టార్ హీరోలు రోజుకో రికార్డును అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో హీరో విజయ్ దేవరకొండ కూడా అలాగే తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీ లోనే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను సమ్పఫించుకున్న హీరోగా సరికొత్త రికార్డును అందుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా అదే తరహాలో సోషల్ మీడియాలో మరొక రికార్డును అందుకున్నాడు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన విజయ్ దేవరకొండ వరుస బాక్సాఫీస్ హిట్స్ తో తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. కథల సెలక్షన్ విషయంలో కూడా విజయ్ ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటోంది. చూస్తుంటే భవిష్యత్తులో అతను బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రత్యేకమైన గుర్తింపును అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంటర్ నెట్ వరల్డ్ లో ఎక్కువగా సెర్చ్ చేయబోతున్న సెలబ్రిటీల పేర్లలో కూడా విజయ్ దేవరకొండ పేరు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది.

ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో 13 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ ను అందుకున్నాడు. ఇప్పటికే ఆ రికార్డును అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఆ నెంబర్ వన్ స్థానానికి పోటీ గా వస్తున్నాడు. సౌత్ ఇండస్ట్రీ లో టాప్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను అందుకున్న హీరోలుగా ఈ ఇద్దరు టాలెంటెడ్ హీరోలు కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 70 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే 1000 మందితో ఒక భారీ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కు కూడా ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఎలాగైనా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.
ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు చార్మి, కరణ్ జోహార్ వంటి వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రెండు వేల కోట్లకు పైగా బడ్జెట్ కూడా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా ఫ్యాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రాబోయే ఎమోషనల్ డ్రామా అని కూడా ఇదివరకే కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆ సినిమాకు కూడా భారీ బడ్జెట్ తోనే గట్టిగానే తెరకెక్కించే అవకాశం ఉందట. మరి ఆ సినిమాలతో విజయ్ దేవరకొండ తన మార్కెట్ ను ఇంకా ఏ స్థాయిలో పెంచుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











