Liger రిలీజ్ తరువాత మరింత వేగం పెంచిన విజయ్ దేవరకొండ.. అప్పుడే జిమ్ లో కసరత్తులు

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఆ పాత్రకు సరైన న్యాయం చేస్తూ సినిమాలో మెయిన్ హైలెట్ గా కనిపిస్తాడు. ఇక లైగర్ సినిమాపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా విజయ్ పాత్రకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. అతను లైగర్ పాత్రలో కనిపించిన విధానం నెవర్ బిఫోర్ అనేలా ఉంది అని జై వోల్టేజ్ లుక్కుతో సెకండ్ హాఫ్ లో మరింత పవర్ఫుల్గా కనిపించాడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతేకాకుండా లైగర్ సినిమా కోసం విజయ్ ఎంతగా కష్టపడ్డాడో కూడా వెండితెరపై కనిపిస్తోంది అని ముఖ్యంగా అతని ఫిట్నెస్ విషయంలో కూడా మెచ్చుకోవాల్సిందే అని కూడా చెబుతున్నారు. ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గానే ముందుకు వెళుతూ ఉంటాడు. వీలైనంతవరకు మంచి కథలను ప్రేక్షకులకు అందించాలి అనే ఆలోచనతోనే ఉంటాడు. ఇక లైగర్ సినిమా గురువారం రోజు విడుదలైన తర్వాత మళ్లీ రెండవ రోజు నుంచే విజయ్ తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నట్లుగా కష్టపడుతున్నాడు.

Vijay devarakonda bounce back after liger release and workouts in gym

అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. జిమ్ ట్రైనర్ తో కలిసి దేవరకొండ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు పరిగెడుతున్నాడు. ఇక తదుపరి సినిమాను విజయ్ శివ నిర్వాన దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఖుషి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. అలాగే విజయ్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. దానికి ర్యాంపేజ్ అనే టైటిల్ కూడా ఆలోచిస్తున్నారు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాటిపై కూడా విజయ్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X