Vijay Devarakonda : సుధీర్ - రష్మి లవ్ స్టోరీ బయటపెట్టిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో ఎన్నో రూమర్డ్ లవ్ బర్డ్ కపుల్స్ ఉన్నాయి. వాళ్ల గురించి ఏ చిన్న వార్త వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. అలాంటి జంటల్లో విజయ్ దేవరకొండ - రష్మిక ఒకరైతే సుడిగాలి సుధీర్ - రష్మి మరొకటి. వీళ్ల కెమిస్ట్రీకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే జనాలకు వీళ్లంతే విపరీతమైన ఆసక్తి. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ - రష్మి రిలేషన్షిప్ గురించి రౌడీ హీరో విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. మరో వారం రోజుల్లో ఉగాది పండగ రాబోతుంది. ఈ సందర్భంగా బుల్లితెరపై పలు టీవీ ఛానల్స్ ఈవెంట్లను నిర్వహిస్తుంటాయి.అలా ఈటీవీ విన్ కూడా ఆడియెన్స్‌ను ఎంటర్టైన్మెంట్ చేసేందుకు ఈ సారి పండగ మనదే అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరించారు. బిగ్‌బాస్ ఫేం శివాజీ, బలగం డైరెక్టర్ వేణు కూడా తమ టీమ్‌లతో కలిసి ఈ షోలో సందడి చేశారు. అలానే ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ కూడా ఈ పండగ సంబరాల్లో భాగమయ్యారు. చాలా కాలం తర్వాత ఈ షోతో సుధీర్ ఈటీవీలోకి రీఎంట్రీ ఇవ్వడం విశేషం.
అయితే ఈ క్రమంలోనే ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ వాట్సాప్ బాయ్స్ అంటూ అక్కడున్న వారిలో జోష్ నింపాడు. అనంతరం సుధీర్ విజయ్‌తో స్మాల్ డౌట్ సర్ అంటూ అడుగుతాడు. పెళ్లి కాని యువతకు ఏమైన చిన్న టిప్ ఇస్తే నాలాంటి వాళ్లకు ఉపయోగపడుతుంది అని చెబుతాడు. దీనికి విజయ్ బదులిస్తూ నా లవ్ స్టోరి కన్నా రోజు నీ ప్రేమ కథే రోజూ వార్తల్లో వస్తుంది కదా. నా కన్నా నువ్వే సీనియర్ అంటూ సరదాగా బదులిస్తాడు. అనంతరం మృణాల్ ఠాకూర్ కూడా వచ్చి సందడి చేస్తుంది. అలా విజయ్, మృణాల్ కలిసి ఫ్యామిలీ స్టార్‌లోని సాంగ్‌కు చిందులేసి ఆకట్టుకున్నారు.
ఇకపోతే ఈ ఈవెంట్లో ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆదితో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా తమదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇంకా బిగ్‌బాస్ 90s వెబ్‌సిరీస్ శివాజీ టీమ్, వేణు బలగం టీమ్ మధ్య పోటీ పెట్టగా డ్యాన్స్, స్కిట్స్‌తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక సుధీర్, హైపర్ ఆదిల మధ్య జరిగిన సరదా సంభాషణ కూడా బాగా ఆకట్టుకుంది. కాగా, ఫ్యామిలీ స్టార్ విషయానికొస్తే ఏప్రిల్ 5న అంటే మరో రోజులో విడుదల కానుంది. గీతాగోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీకి ప్రొడ్యూస్ చేశారు.


Click it and Unblock the Notifications











