బింబిసార, సీతారామం సక్సెస్.. విజయ్ దేవరకొండ ఆసక్తికర ట్వీట్!

చాలా కాలం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నుంచి నేరుగా వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాలకు మంచి టాక్ రావడంతో టాలీవుడ్ పెద్దలు కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాల సక్సెస్ నేపథ్యంలో రెండు సినిమాల యూనిట్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయగా విజయ్ దేవరకొండ కూడా ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బింబిసార

బింబిసార

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం బింబిసార. ఈ సినిమాను నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించారు. మల్లిడి వశిష్ట గతంలోనే ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాను బింబిసార పేరుతో విడుదల చేయగా సినిమాకి సూపర్ హిట్ టాక్ లభించింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా కేథరిన్ థెరిసా, సంయుక్త మీనన్ నటించిన వరీనా హుస్సేన్ ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించారు.

సీతారామం

సీతారామం

ఇక దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం అనే సినిమా రూపొందింది. ప్రఖ్యాత వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సుమంత్, రష్మిక మందన్న కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి కూడా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ లభిస్తుంది. దీంతో ఈ సినిమాను కూడా చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

 కంటెంట్ బాగుంటే

కంటెంట్ బాగుంటే


ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలు రెండూ మంచిగా ఆడుతూ ఉండడంతో పాటు మంచి టాక్ తెచ్చుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమా యూనిట్లకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా సినిమాలను ఆదరిస్తారని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మిగతా సినీ ప్రముఖులు కూడా ఈ విషయం మీద ట్వీట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాకి సంబంధించిన ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

 ప్రత్యేకంగా

ప్రత్యేకంగా


మరోవైపు విజయ్‌ దేవరకొండ సైతం రెండు చిత్రాలకు అభినందనలు తెలిపారు. ఒకే రోజు రెండు సినిమాలు విజయం సాధించాయని తెలిసి చాలా ఆనందమేసిందని, రెండు సినిమాల గురించి చాలా మంచి విషయాలు విన్నానని చెప్పారు విజయ్‌. బింబిసార చిత్ర యూనిట్‌కి, సీతారామం సినిమా యూనిట్‌కి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్స్ చేశారు విజయ్‌ దేవరకొండ.

 అద్భుతమైన స్పందన

అద్భుతమైన స్పందన


ఒకే రోజు 2 సినిమాలు హిట్‌గా మారడం చాలా సంతోషంగా ఉంది. ఎంత మంచి రోజు ఇది, వైజయంతి ఫిల్మ్స్, దుల్కర్, మృణాల్, రష్మిక, సుమంత్ అన్నలకు అభినందనలు, హను రాఘవపూడి, సీతారామం బృందానికి అభినందనలు అని అయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా గురించి చాలా అద్భుతమైన విషయాలు విన్నానని ఆయన అన్నారు. నందమూరి కళ్యాణ్ గారు, హరి గారు, వశిష్ఠ గారు, ఎంఎం కీరవాణి గారు మరియు టీమ్ బింబిసారాకి అభినందనలు, మీ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చిందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X