twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగంలోకి దిగిన విజయ్.. రూ.1.30 కోట్ల భారీ విరాళం.. రౌడీ స్టార్ రూటే వేరు

    |

    హీరోలందు విజయ్ దేవరకొండ వేరయా.. అన్నట్టు ఈ రౌడీ చర్యలన్నీ ఊహాతీతమే. అందరూ వేళ్లే రూట్ వెళ్లడు. తనకంటూ ప్రత్యేకంగా ఓ దారి వేసుకుని మరీ వెళతాడు. నలుగురిలో ఒకడిలా కాదు.. ఆ నలుగురు తిరిగే చూసే ఒక్కడిలా అందర్నీ ఆకట్టుకుంటాడు. కరోనా వైరస్‌పై పోరాటం సాగించేందుకు ప్రభుత్వాలకు సినీ హీరోలు ఆర్థిక విరాళాలు ప్రకటించి అండగా నిలబడ్డారు.

    సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి విరాళాలు ఇచ్చారు. అందరూ ముందుకు వచ్చి తమకు తోచినది ఇస్తూ ఉంటే విజయ్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. అలాంటి సమయంలో విజయ్‌పై సోషల్ మీడియాలో లెక్కలెనన్ని ట్రోల్స్ వచ్చాయి. అయితే వాటన్నంటికి ఒకే ట్వీట్‌తో సమాధానం చెప్పాడీ రౌడీ హీరో. అదేంటో ఓ సారి చూద్దాం.

    దేవరకొండ ఫౌండేషన్ ద్వారా..

    దేవరకొండ ఫౌండేషన్ ద్వారా..

    దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విజయ్ ఎంతో మందికి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా సాయం పొందిని ఓ క్రీడాకారుడు జాతీయ స్థాయిలో పతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఫౌండేషన్ ద్వారా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

    రెండు భారీ ప్రకటనలు..

    విజయ్ దేవరకొండ తాజాగా రెండు ప్రకటనలు చేశాడు. ఇందులో ఒకటి ఉద్యోగ కల్పన, రెండో నిత్యావసర సరకులను అందించడం అంటూ వీటి గురించి క్షుణ్ణంగా వివరించాడు. తానెప్పటి నుంచో ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ చేస్తున్నానని, మొదటగా కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను తమ టీమ్ ఎంచుకుందని, వారి ద్వారా కొంతమందికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్‌లో వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని తెలిపాడు.

    ఉద్యోగ కల్పనకు కోటి..

    ఉద్యోగ కల్పనకు కోటి..

    చివరకు ఓ యాభై మందిని తమ టీమ్ సెలెక్ట్ చేసిందని, అందులో ఓ ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపాడు. ఈ లాక్ డౌన్ వల్ల మిగతా 48 మంది రిజల్ట్ ఆగిపోయిందని పేర్కొన్నాడు. ఓ చేపను ఇస్తే ఒక రోజుకు సరిపోతుంది.. అదే చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతుకుతాడనే సామెతను తాను నమ్ముతానని అందుకే ఉద్యోగ కల్పనను ధ్యేయంగా పెట్టుకున్నానని, తన వల్ల కనీసం లక్ష మందైన ఉద్యోగాలు సంపాదించాలన్నాడు. ఈ మేరకు ఈ విపత్కర సమయంలో ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌కు కోటి విరాళం ఇస్తున్నట్టు తెలిపాడు.

    Recommended Video

    Vijay Devarakonda Be The Real Man Challenge Video
    నిత్యావసర సరుకులు..

    నిత్యావసర సరుకులు..

    మన మిడిల్ క్లాస్ వాళ్లకు ఇలాంటి సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే తమ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండని, డీటైల్స్ ఇవ్వండని, తన బృందం ఫోన్ చేస్తుందని, మీకు దగ్గర్లో ఉన్న కిరాణానికి వెళ్లి సరుకులు కోనుక్కోండని డబ్బులు తన టీమ్ భరిస్తుందని తెలిపాడు.

    English summary
    Vijay Devarakonda Donates 1. 3 Crores In Corona crisis. set up a dedicated fund with an aim to provide relief to affected middle-class families during the COVID crisis. The fund will help affected families buy basic groceries and essential food items.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X