Don't Miss!
- Sports
ప్రతిసారీ దాని వల్లే ప్రాబ్లమవుతుంది.. ఇండియా వుమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యాఖ్యలు
- Lifestyle
Childhood Crush: చిన్నప్పటి ప్రేమను ఎందుకు మర్చిపోలేం.. ఏమిటా ప్రత్యేకత?
- News
viral video:ఎండలో నిల్చొని పాపడ్స్ విక్రయించి.. వృద్దురాలి కష్టం.. వైరల్
- Automobiles
యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..
- Technology
Whatsapp ,Telegram & Signal మెసేజింగ్ App లపై గవర్నమెంట్ కొత్త రూల్స్ ? జాగ్రత్త ...?
- Finance
Bangladesh Crisis: శ్రీలంక బాటలో బంగ్లాదేశ్.. ఆకాశానికి పెట్రోల్ ధరలు.. బంకుల వద్ద జనం బారులు..
- Travel
ట్రెక్కింగ్ ప్రియులకు కొత్తగా పరిచయమైన హిల్‌స్టేషన్.. వంజంగి
అమ్మను హత్తుకొని విజయ్ దేవరకొండ ఎమోషనల్.. నా కోసం పోరాడుతున్నారు అంటూ..
టాలీవుడ్ రౌడి స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ తన అభిమానులను ఎంతగా లైక్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో కూడా అతను ఎంతోమందికి సహాయం చేశాడు. ఇప్పటికి కూడా లేని వారికి తనవంతు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మంగళవారం విజయ్ దేవరకొండ తన 33వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సెలబ్రెటీలు అభిమానులు కూడా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక
విజయ్
దేవరకొండ
ఒకవైపు
ఫ్యామిలీ,
మరోవైపు
అభిమానులు
చూపిస్తున్న
ప్రేమకు
ఎమోషనల్
అయ్యారు.
ఇక
సోషల్
మీడియాలో
తన
తల్లిని
హత్తుకుని
ఉన్న
ఒక
ఫొటోను
పోస్ట్
చేసి
ఈ
విధంగా
స్పంధించాడు.
ఆ
వివరాల్లోకి
వెళితే..
విజయ్
ఈ
విధంగా
స్పందించారు.
నాకు
15
ఏళ్ల
వయసులో
పుట్టినరోజులు
జరుపుకోవడం
మానేసిన
వ్యక్తికి
-
మీ
ప్రేమ
నన్ను
వారి
పట్ల
శ్రద్ధ
చూపేలా
చేసింది..
అని
విజయ్
తన
తల్లి
గొప్పతనం
గురించి
చెప్పారు.

ఇక 8 సంవత్సరాల క్రితం మీకు నా పేరు, నా ఉనికి గురించి తెలియదు అంటూ ఈ రోజు మీరు నన్ను ఉత్సాహపరుస్తారని అలాగే నాకు మద్దతు ఇస్తున్నారని నా కోసం పోరాడుతున్నారని విజయ్ తెలిపారు. ఇక నన్ను ఎంతగానో నమ్ముతున్నారని మీలో చాలా మంది నాకు ఎనలేని లేని ప్రేమను ఇస్తున్నారు అంటూ నేను మీకు మళ్ళీ ఆ ప్రేమను ఇవ్వాలని అనుకుంటున్నట్లు.. పేర్కొన్నారు.
ఫైనల్ గా ఎదో ఒక విధంగా తన ప్రేమను తిరిగి ఇస్తానని చెప్పిన విజయ్ నేను అనుభూతి చెందుతున్న ప్రేమ, మీరు నా నుండి అనుభూతి చెందుతారని అన్నారు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి అలాగే పోరాడుతూ ఉండండి.. అని నటుడు తన ప్రియమైన తల్లి గురించి కూడా ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. ఇక విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును శివ నిర్వాణ దర్శకత్వం వహించిన VD 11 సెట్స్‌లో అద్భుతంగా జరుపుకున్నాడు. సమంత కూడా విజయ్ పుట్టినరోజు సందర్భంగా తన స్పెషల్ విషెస్ ను అందించింది.
I just want to let you know, it shall be returned. One way or another, the love I feel from you, you shall feel from me ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) May 10, 2022
Stay healthy, stay Happy & keep fighting :)
Full love,
Your man
Vijay Deverakonda.
ఇక విజయ్ దేవరకొండ రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం లైగ ర్ సినిమా విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 25 వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ జనగణమన అనే మరొక ప్రాజెక్టును కూడా మొదలు పెట్టాడు. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ కు ఇండియా తగ్గట్టుగా విడుదల చేయాలని విజయ్ దేవరకొండ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పుష్ప అనంతరం సుకుమార్ విజయ్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. మరి ఈ సినిమాలతో విజయ్ దేవరకొండ రేంజ్ ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.