Vijay Devarakonda: ఆ ఈవెంట్‌కు లుంగీలో విజయ్ దేవరకొండ.. ఆ మూడే ముఖ్యమంటూ!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదిరిపోయే సినిమాలతో వస్తూ అందిరనీ మెస్మరైజ్ చేసే ఈయనకు ఈ మధ్య ఒక్క హిట్ పడడం లేదు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో వస్తున్నాడు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఈవెంట్ కు హాజరు కాగా.. లుంగీ కట్టుకుని వచ్చాడు. ఫ్యామిలీ స్టార్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. ముఖ్యంగా ప్రతీ ఒక్కరి జీవితంలో ఆ మూడే ముఖ్యం అంటూ నిజమైన ఫ్యామిలీ మాన్ లా మాట్లాడాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. కేయు మోహనన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

Vijay Devarakonda in Family Star Avatar at TFJA Event Check Details

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల అయిన అన్ని పాటలు, టీజర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా నందనందనా పాటతో పాటు.. ఐరనే వంచాలా ఏంటి, లీటర్ పెట్రోల్ కొట్టిస్తావా అంటూ హీరోయిన్ ను అడిగే డైలాగ్ అయితే అదిరిపోయాయి. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికీ పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

అయితే తాజాగా హీరో విజయ్ దేవరకొండ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడకు అచ్చమైన ఫ్యామిలీ స్టార్ లుక్ లో వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ముఖ్యంగా బ్లూ కలర్ షర్ట్, లోపల బనియన్.. నేవీ బ్లూ లుంగీలో విజయ్ లుక్ అదిరిపోయింది. ఇలా అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చిన ఈయన జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆ మాడే ముఖ్యం అంటూ చెప్పొకొచ్చారు.

Vijay Devarakonda in Family Star Avatar at TFJA Event Check Details

ముందుగా హెల్త్, సెకండ్ హ్యాపీనెస్, థార్డ్ డబ్బులు ముఖ్యం అని.. తానొక్కడికే కాకుండా ప్రతీ ఒక్కరికి ఇవే ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చాడు. అలాగే లైఫ్ లో ఏది చేసినా ఈ మూడే కావాలని.. హెల్త్ లేకపోతే డబ్బు సంపాధించలమేని విజయ్ దేవరకొండ వివరించాడు. డబ్బు ఉంటే హెల్త్ కు కూడా ఉపయోగపడుతుందని.. మనం ఏం చేసినా ఆనందంగా ఉండేలా.. అందరినీ హ్యాపీగా ఉంచేలా చేయాలని చెప్పారు. ఇలా అచ్చమైన ఫ్యామిలీ స్టార్ లో మారిపోయిన విజయ్ దేవరకొండను చూసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X