విజయ్ తో డేటింగ్ చేస్తానన్న సారా అలీఖాన్.. క్యూట్ అంటున్న దేవరకొండ!
విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ల సైతం ఆయనే తన క్రష్ అంటూ వెల్లడిస్తున్న వైనాన్ని ఇప్పుడు దేశ ప్రజలందరూ ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ తన క్రష్ విజయ్ దేవరకొండ అని పలు సందర్భాల్లో వెల్లడిస్తే తాజాగా సారా అలీఖాన్ కూడా తన క్రష్ విజయ్ దేవరకొండ అనే విషయాన్ని బయట పెట్టింది. అయితే ఈ విషయం మీద విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా స్పందించాడు ఆ వివరాల్లోకి వెళితే

షోకి గెస్టులుగా
బాలీవుడ్ టాప్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హోస్ట్ చేస్తున్నాడు. ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రస్తుతానికి ఒక్కొకటి హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతున్నాయి. తాజాగా కరణ్ జోహార్ సారా అలీ ఖాన్ జాన్వీ కపూర్ లను తన షోకి గెస్టులుగా పిలిచి వారిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఆ ప్రోమో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సోషల్ మీడియాలో వైరల్
జాన్వీ కపూర్ సారా అలీ ఖాన్ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పాలని కోరిన కరణ్ జోహార్ ఆ తర్వాత ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు అనే విషయం కూడా చెప్పాలని సారాని అడిగారు. అయితే దానికి ముందు సమాధానం చెప్పను అన్నా సరే చివరికి విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. అయితే వెంటనే కరణ్ జాన్వీకి కూడా విజయ్ అంటే ఇష్టమని మీకు తెలుసా అంటే దానికి ఆమె నవ్వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ హగ్స్
ఇక ఈ వీడియో చూసిన విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. సారా అలీ ఖాన్ డేటింగ్ కామెంట్స్ పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ దేవరకొండ అని నువ్వు పిలిచే విధానం నాకు బాగా నచ్చింది. క్యూటెస్ట్ నీకు నా బిగ్ హగ్స్ అండ్ ఎఫెక్షన్ పంపుతున్నా అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

అద్భుతమైన స్పందన
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆయన ఒక కిక్ బాక్సర్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ కూడా విడుదలైంది. ఆ సాంగ్ కి అద్భుతమైన స్పందన అయితే లభించింది.

పూరీతో మూడో సినిమా
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సమయంలోనే పూరి జగన్నాథ్ తో జనగణమన అనే సినిమా కూడా ప్రకటించారు విజయ్ దేవరకొండ. ఇక ఆ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించడం ఆసక్తికరంగా మారింది. ఇక పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా కూడా ప్లాన్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











