Liger మూవీ నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్..సమంతతో సినిమాపై విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్

చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మొదట పాన్ ఇండియా అనుకోలేదు. సినిమా షూట్ మొదలు అయిన విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా తాను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటానని ముందుకు వచ్చాడు. ఆయన కూడా ముందుకు రావడంతో ఈ సినిమా కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్స్ బ్యానర్ల మీద నిర్మితమవుతుంది. అయితే నిర్మాణ బాధ్యతలు అన్నీ కూడా పూరి కనెక్ట్స్ తరఫున ఛార్మి, ధర్మ ప్రొడక్షన్స్ తరపున అపూర్వ మెహతా చూసుకుంటున్నారు.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా అమెరికా లెజెండ్ బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఒక స్లమ్ లో ఉండే ఛాయ్ బండి నడుపుకునే వ్యక్తి ప్రపంచ స్థాయి బాక్సర్ గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్టుతో పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు ఆగస్టు 25 వ తేదీన ఈ సినిమా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

Vijay Devarakonda intresting comments on liger and vd 11

ఇక ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తయింది కాబట్టి విజయ్ తన 11వ సినిమా షూట్ లో పాల్గొంటున్నారు.ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో విజయ్ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు అనేది ఆసక్తికరంగా మారగా డానికి హింట్ ఇస్తూ విజయ్ దేవరకొండ ఒక వీడియో షేర్ చేశాడు. తన లైగర్ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా కాగా, ఇక తన 11 వ సినిమా ఒక ఫన్నీయస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని పేర్కొన్నాడు. అంతే కాదు కాశ్మీర్ లో బోటు రైడింగ్ చేస్తున్న వీడియో కూడా షేర్ చేశారు. ఇక కాశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అని అంటున్నారు. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ బైకర్ గా కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈసినిమాలో సాగుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X