రౌడీ రేంజ్ మామూలుగా లేదే.. ఆ విషయంలో ఏకంగా దేశంలోనే మూడో స్టానం!!

విజయ్ దేవరకొండ రేంజ్ ఏ పాటిదో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ప్రయాణం మొదలెట్టి.. అలా కోలీవుడ్‌లోనూ పాగా వేశాడు. ఇక డియర్ కామ్రేడ్‌తో ఏకంగా దక్షిణాదిపై పట్టు సాధించాడు. సినిమా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చినా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. యూట్యూబ్, బుల్లితెరపై డియర్ కామ్రేడ్ దుమ్ములేపింది. ఇక ఈ సినిమా తరువాత విజయ్ ఏకంగా ప్యాన్ ఇండియా లెవెల్‌లో కెరీర్‌ను ప్లాన్ చేసుకున్నాడు.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేసిన ఈ మూవీ షూటింగ్ దాదాపు ముంబై పరిసరాల్లోనే ఉండబోతోంది. ఈ మేరకు ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. కరోనా విజృంభిస్తుండటంతో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఈ మేరకు నాలుగు నెలల నుంచి విజయ్ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ మధ్యే వర్కౌట్లు చేస్తూ శరీరాకృతిని మార్చుకునేందుకు రెడీ అయ్యాడు. అందులో భాగంగా బయటకు వచ్చిన విజయ్ పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

 vijay Devarakonda Is At Top 3 In Most Desirable Men List

సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. తాజాగా విజయ్ మరో ఘనతను సాధించాడు. ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్ ల లిస్ట్ లో విజయ్ ఏకంగా మూడు స్థానం దక్కించుకోవడం విశేషం.మొదటి స్థానంలో షాహిద్ కపూర్,,రెండో స్థానం లో రణ్ వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా వరుసగా 2018,2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X