సౌత్ ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు.. విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు!
విజయ్ దేవరకొండ అది పేరు కాదు.. ఓ బ్రాండ్. అర్జున్ రెడ్డి సినిమాతో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు ఉత్తరాది ప్రేక్షకులనూ కట్టిపడేశాడు. అర్జున్ రెడ్డి దెబ్బకు మిగతా పరిశ్రమలన్నీ టాలీవుడ్ వైపు చూశాయి. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయింది. ఆ వెనువెంటనే గీతగోవిందం వంటి మరో క్లాస్ ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఈ దెబ్బకు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా విజయ్‌కు అభిమానులు అయిపోయారు.
సినిమాల్లో విజయ్‌ది ఓ ప్రత్యేకమైతే.. నిజ జీవితం, సోషల్ మీడియాలో విజయ్ మరింత భిన్నంగా ఉంటాడు. అందుకే విజయ్ దేవరకొండకు అంతటి ఫాలోయింగ్. స్టేజ్ ఎక్కినా, పబ్లిక్ ఫ్లాట్‌ఫాంపై స్పీచులు ఇచ్చినా విజయ్‌ది నేల టిక్కెట్టు మాదిరి. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు నటించడం రానివాడని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు.

విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. యూత్ ఎక్కువగా విజయ్‌ను ఫాలో అవుతుంటారు. తాజాగా విజయ్ ఓ ఫీట్‌ను అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటోన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలకు అందని ఫీట్‌ను చాలా తొందరగా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండకు 8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే మహేష్ బాబు 5.2, అల్లు అర్జున్ 7.6, ఎన్టీఆర్ 1.8, ప్రభాస్ 4.8, రామ్ చరణ్ 2.6 మిలియన్లే ఉన్నారు. విజయ్ ప్రస్తుతం పూరి డైరెక్షన్‌లో ఫైటర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











