అందుకే మరి యూత్ ఐకాన్.. విజయ్ దేవరకొండ పిక్స్ వైరల్

రౌడీ అని ముద్దుగా పిలుచుకున్నా.. టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చినా అవన్నీ విజయ్ దేవరకొండకు సరిపోయేవే. విజయ్ దేవరకొండ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరోనే కాదు.. ప్యాన్ ఇండియన్ స్టార్‌గా అయ్యేందుకు అడుగులు వేస్తున్నాడు. డియర్ కామ్రేడ్ చిత్రంతో మొత్తం దక్షిణాదిపై పాగా వేసేందుకు ట్రై చేశాడు. ఇప్పుడు పూరి జగన్నాద్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

మామూలుగా అయితే ఈపాటికే ఫైటర్ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. తెలుగు తెరకు అనన్య పాండే పరిచయం అయ్యేది. అయితే కరోనా వచ్చి అంతా తారుమారు చేసింది. ముంబైలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఫైటర్ యూనిట్‌కు కరోనా దెబ్బ తగిలింది. కరోనా, లాక్ డౌన్, సినిమా పరిశ్రమ మూతబడటంతో షూటింగ్లన్నీ ఆగిపోయాయి. దీంతో సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు.

vijay Devarakonda latest Pics Goes Viral

విజయ్ దేవరకొండ లాక్ డౌన్‌లో ఎంత సందడిగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఇక ఆ మధ్య ఫేక్ న్యూస్ రాసే వెబ్ సైట్లపై చేసిన పోరు సంచలనం సృష్టించింది. ఇక ఫైటర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ కొత్త మేకోవర్‌ను ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్షల్ ఆర్ట్స్, జిమ్‌లో తెగ కష్టపడ్డాడు. మధ్యలో ఈ లాక్ డౌన్ రావడంతో కాసింత రిలాక్స్ అయినట్టున్నాడు. కానీ ప్రస్తుతం మళ్లీ చెమటోడ్చడానికి రెడీ అయ్యాడు. జిమ్‌లో తెగ కష్టపడి వస్తోన్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ క్యాజువల్ లుక్స్ దుమ్ములేపుతున్నాయి. అందుకే విజయ్‌ను యూత్ ఐకాన్ అంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X