For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చరిత్ర సృష్టించిన విజయ్ దేవరకొండ: ఒకే ఒక్క ఫొటోతో సౌతిండియా రికార్డ్.. రౌడీ రేంజ్ ఇదే మరి!

  |

  విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఈ యంగ్ టాలెంటెడ్ స్టార్ టాలీవుడ్‌లో తన హవాను చూపిస్తున్నాడు. హీరోగా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్న అతడు.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదే సమయంలో నేషనల్ లెవెల్‌లో గుర్తింపును సైతం దక్కించుకున్నాడు. ఇక, ఇప్పుడు 'లైగర్' అనే సినిమాను చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. తద్వారా సౌతిండియాలో ఫస్ట్ హీరోగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే...

  అలా వచ్చాడు.. ఇలా స్టార్ అయ్యాడు

  అలా వచ్చాడు.. ఇలా స్టార్ అయ్యాడు

  కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీని తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి'తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అనంతరం ‘గీత గోవిందం', ‘టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ.

  పరాజయాల పరంపరతో ఇబ్బందులు

  పరాజయాల పరంపరతో ఇబ్బందులు

  తొలినాళ్లలోనే భారీ విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ.. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవలి కాలంలో ఈ క్రేజీ హీరో నటించిన ‘నోటా' ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో అతడి గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. అయినప్పటికీ భారీ చిత్రాల్లోనే భాగం అవుతూ సత్తా చాటుతున్నాడతను.

   ‘లైగర్'గా వస్తున్న విజయ్ దేవరకొండ

  ‘లైగర్'గా వస్తున్న విజయ్ దేవరకొండ

  సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఇది సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతున్నట్లు గతంలో ప్రకటించారు.

  పాన్ ఇండియా స్టార్‌గా అయ్యేందుకిలా

  పాన్ ఇండియా స్టార్‌గా అయ్యేందుకిలా

  ‘లైగర్'తో నేరుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు తెగ కష్ట పడుతున్నాడు. ఈ సినిమా కోసం అన్ని భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు. అలాగే, సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నాడు. ఇక, ఈ చిత్రం కోసం బాక్సింగ్‌లో మెళకువలు కూడా నేర్చుకున్నాడు. అలాగే, లుక్ పరంగానూ వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు.

  సినిమాలో హైలైట్లు.. వాళ్లతో ఫైటింగ్స్

  సినిమాలో హైలైట్లు.. వాళ్లతో ఫైటింగ్స్

  బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న ‘లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది.

  చరిత్ర సృష్టించిన విజయ్ దేవరకొండ

  చరిత్ర సృష్టించిన విజయ్ దేవరకొండ

  ‘లైగర్' కోసం విజయ్ దేవరకొండ అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సమయంలోనే చూశాం. అందుకు అనుగుణంగానే పూరీ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ తాజాగా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. తద్వారా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సౌత్ ఇండియాలోనే చరిత్ర సృష్టించాడు.

  Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
  ఒకే ఒక్క ఫొటోతో సౌతిండియా రికార్డ్

  ఒకే ఒక్క ఫొటోతో సౌతిండియా రికార్డ్

  ‘లైగర్' ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు మిలియన్ల లైకులను సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఏకైక పోస్టర్‌గా ఇది రికార్డును క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలోనే ఇప్పటి వరకూ ఏ హీరో సినిమాకూ ఇది సాధ్యం కాలేదు. దీంతో రౌడీ స్టార్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఫలితంగా విజయ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది.

  English summary
  Tollywood Star Hero Vijay Devarakonda Now Doing Liger Movie Under Puri Jagannadh Direction. Now This Movie First Look Poster Got 2Million Likes in Instagram. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X