Vijay Devarakonda ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందుగానే స్పెషల్ ఫ్యాన్ షోలు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైగర్ సినిమా ఈవారం గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ మాస్ యాక్షన్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అలాగే సాంగ్స్ అన్నీ కూడా భారీ స్థాయిలో హైప్ అయితే క్రియేట్ చేశాయి. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు.

ఇక అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ముందుగానే స్పెషల్ ఫ్యాన్ షోలు ప్రదర్శించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు లైగర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ క్రమంలో ఆగస్టు 24వ తేదీన ప్రత్యేకంగా ఫ్యాన్ షోలు కూడా ప్రదర్శించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే విజయ్ దేవరకొండ ఇటీవల ఆ విషయంపై చర్చలు జరుపుకున్నట్లు టాక్ అయితే వస్తోంది.

vijay devarakonda liger movie team discussion on special fans shows

తప్పకుండా ఫాన్స్ కు ఈ సినిమా సరికొత్త కిక్ ఇస్తుంది అని కొన్ని మాస్ ఏరియాలలో ప్రీమియర్ షోలను ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. తప్పకుండా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఇక స్పెషల్ షోలు వేస్తే టికెట్ల కోసం కూడా ఫ్యాన్స్ ఏకపడతారు అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ అభిమానులు కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు.

అలాగే పలు ఏరియాలలో ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున కూడా స్పెషల్ లైగర్ షోలను ప్రదర్శించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక విజయ్ దేవరకొండ కెరిర్ లోనే ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద విజయ్ తన కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. మరి సినిమా మొత్తం గా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X