50 కొట్టేసింది!!.. క్యూట్ వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండను ఫాలో అయ్యే వారికి ఓ విషయం తెలిసే ఉంటుంది. విజయ్‌కి తన తల్లి (మాధవి) అంటే ఎంతో ఇష్టమని.. ఆమెను ఎంత బాగా చూసుకుంటాడో అన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య డియర్ కామ్రేడ్ షూటింగ్‌లో బిజీగా ఉండి ఓ రెండు మూడు నెలలు ఇంటికే రాలేదట. అమ్మతో మాట్లాడే వీలు లేకపోయిందని ఎంతో ఫీల్ అయ్యాడు.

ఇక చాలా గ్యాప్ తరువాత ఇంటికి వచ్చిన విజయ్ అమ్మను ప్రేమగా హత్తుకుని సర్ ప్రైజ్ ఇచ్చాడు. అలా అందరూ చేయాలని ఓ ఛాలెంజ్ కూడా అప్పట్లో విసిరాడు. ఇక లాక్‌డౌన్‌లో దేవరకొండ బ్రదర్స్ ఎంత జాలీగా గడిపారో అందరికీ తెలిసిందే. ఇంట్లో పనులు చేసుకుంటూ.. ఆటలు ఆడుకుంటా ఎంతో జాలీగా గడిపేశారు. అంతేకాకుండా ఈ కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఫేక్ న్యూస్ రాసే వారిపై ఉద్యమాన్ని ప్రకటించాడు.

Vijay Devarakonda Mother Turns 50 ANd shares A Cute video

తాజాగా విజయ్ దేవరకొండ ఓ క్యూట్ వీడియోను షేర్ చేశారు. తన తల్లికి బర్త్ డే సందర్బంగా విషెస్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేశాడు. 50వ పుట్టిన రోజు కావడం, పైగా ఇది ఐపీఎల్ సీజన్ కావడంతో అదే స్టైల్లో విషెస్ చెప్పారు. 50 రన్స్ కొట్టేసిందనే సింబాలిక్‌గా బ్యాట్ ఎత్తి చూపించింది. కొడుకులకు తగ్గ తల్లి.. తల్లికి తగ్గ కొడుకులు అంటూ దేవరకొండ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. విజయ్ ప్రస్తుతం ఫైటర్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. అంతేకాకుంగా పుల్వామా దాడి ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంతో బాలీవుడ్‌లో నేరుగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X