Vijay Devarakonda: బిగ్ ప్రొడక్షన్ లో రౌడీ స్టార్ సరికొత్త ప్రాజెక్ట్..తొలిసారిగా అలాంటి కాన్సెప్ట్ లో ప్రయోగం
రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ప్రతీ సినిమాకు ఏదో ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ తో ఆకట్టుకుంటు వస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నాడు. అలాగే జానర్స్ కూడా మార్చాలని అనుకుంటున్నాడు. పవర్ఫుల్ కథల కోసం సెర్చ్ చేస్తున్న రౌడి స్టార్ ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో నెవ్వర్ బిఫోర్ అనే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఒక టాక్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ట్రెండ్ మార్చిన దిల్ రాజు: దిల్ రాజు ప్రస్తుతం ట్రెండ్ మార్చారు. గతంలో మాదిరగా మినిమమ్ బడ్జెట్ కాకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నారు. వందల కోట్ల రూపాయిల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి వెనుకాడటం లేదు. ఇప్పటికే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ 200 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఇతర హీరోలతో చేస్తోన్న సినిమాలు కూడా 50 కోట్లకి పైగా బడ్జెట్ లతోనే ప్లాన్ చేస్తున్నారు.

జటాయు టైటిల్ తో మరో మూవీ: అన్ని కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీస్ తో పాన్ ఇండియా లెవల్ మార్కెట్ చేయగలిగే సినిమాల పైనే అతని దృష్టి మొత్తం ఉంది. నెక్స్ట్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక చిత్రం ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. అలాగే జటాయు టైటిల్ తో ఒక ఫిక్షనల్ కాన్సెప్ట్ తో విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ గా కథ సిద్ధం అవుతోందని చెప్పారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

విజయ్ దేవరకొండ ఫిక్స్ అయినట్లే: ఇక ఈ మూవీ కోసం ఓ స్టార్ హీరోని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇంద్రగంటి, విజయ్ ఈ మూవీ స్క్రిప్ట్ పై కూర్చున్నారంట. ఇద్దరి మంచి స్టొరీ డిస్కసన్ కూడా జరిగిందని తెలుస్తోంది.

పరశురామ్ సినిమాతో బిజీగా: అన్నిసెట్ అయితే ఈ విజయ్ దేవరకొండ ఈ సూపర్ ఫాంటసీ మూవీలో నటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలోనే పరశురామ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత జటాయు సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్, ప్రభాస్ మూవీతో పాటు జటాయు కూడా వచ్చే ఏడాదిలో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొడితే దిల్ రాజుకి పాన్ ఇండియా మార్కెట్ పై పూర్తిస్థాయిలో అవగాహనా వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మరింతగా డేర్ చేసి ప్రభాస్ సినిమాపై ఫోకస్ పెట్టె ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











