విజయ్ దేవరకొండ పొలిటికల్ థ్రిల్లర్.. విడుదల అప్పుడేనా!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. గీత గోవిందం చిత్ర వసూళ్లు కళ్ళు చెదిరేవిధంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా విజయ్ తన చిత్రాల జోరు పెంచబోతున్నాడు. విజయ్ నటిస్తున్న చిత్రాలు మూడు క్యూలో ఉన్నాయి. డియర్ కామ్రేడ్, టాక్సీ వాలా చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. మరోవైపు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నోటా తెరకెక్కుతోంది.
ఈ చిత్ర విడుదలకు సంబందించిన ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నోటా చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











