నోటా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్ ఎంతో తెలుసా!
Recommended Video

యంగ్ హీరో విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గీత గోవిందం చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలపై యువతలో మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఇటీవల విడుదలైన నోటా ట్రైలర్ అదరగొడుతోంది. నోటా చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు. తాజగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులకోసం 25 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ నిర్మాతలు కనీసం 30 కోట్ల బిజినెస్ జరగాలని ప్లాన్ చేస్తున్నారట. గీత గోవిందం చిత్రంతో విజయ్ దేవరకొండ మార్కెట్ పెరిగింది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











