లవ్ మ్యారేజ్... పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, ఎప్పుడంటే?

By Bojja Kumar

'గీత గోవిందం' సినిమా భారీ విజయం సాధించడంతో టాలీవుడ్లో సరికొత్త స్టార్ హీరోగా అవతరించాడు విజయ్ దేవకొండ. ఈ యంగ్ హీరో నటించిన గత చిత్రం 'అర్జున్ రెడ్డి' రూ. 50 కోట్లకుపైగా వసూలు చేయగా... లేటెస్ట్ రిలీజ్ 'గీత గోవిందం' ఇప్పటికే రూ. 75 కోట్లు రాబట్టి వందకోట్ల దిశగా పరుగులు పెడుతోంది. గత పది రోజులుగా టాలీవుడ్లో విజయ్ దేవరకొండ గురించి, సినిమా విజయం గురించి, అతడికి రోజు రోజుకు పెరిగిపోతున్న స్టార్ ఇమేజ్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Recommended Video

Vijay Devarakonda Speaks About Present Day Girl's Attitude
 అందరికీ తెగ నచ్చేసింది

అందరికీ తెగ నచ్చేసింది

‘అర్జున్ రెడ్డి'లో అగ్రెసివ్ రోల్ పోషించిన ఈ స్టార్... అందకు భిన్నమైన నటన తన తాజా చిత్రంలో ప్రదర్శించి అందిరీ ఆశ్చర్య పరిచాడు. ‘గీత గోవిందం' ఇంత పెద్ద హిట్ కావడానికి విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అని చెప్పక తప్పదు.

 అమ్మాయిల్లో విజయ్ దేవరకొండ ఫీవర్

అమ్మాయిల్లో విజయ్ దేవరకొండ ఫీవర్

‘అర్జున్ రెడ్డి' సినిమాతో భారీగా యూత్ (అబ్బాయిలు) ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ... ‘గీత గోవిందం' సినిమాతో అమ్మాయికు తెగ నచ్చేశాడు. అతడి కూల్ యాటిట్యూడ్, మాట్లాడే విధానం, ఎప్పుడూ చిల్‌ఔట్‌గా ఉండటం లాంటి పనులతో..... తమకు ఇలాంటి భర్తే కావాలి అని అమ్మాయిలు కోరుకునే స్థాయికి వెళ్లిపోయాడు.

 పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు

‘గీత గోవిందం' ప్రమోషన్లలో బిజీ అయిపోయిన విజయ్ దేవరకొండకు.... పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో విజయ్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. తొలుత తాను 40 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ దాన్ని ఇపుడు 35కు తగ్గించుకున్నాను. అందుకు ‘గీత గోవిందం' కూడా కారణం అయుండొచ్చు అన్నారు.

 లవ్ మ్యారేజ్ చేసుకుంటా

లవ్ మ్యారేజ్ చేసుకుంటా

తన మైండ్ సెట్‌కు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదని తేల్చి చెప్పిన విజయ్.... ఎప్పటికైనా లవ్ మ్యారేజే చేసుకుంటానన్నాడు. అయితే ఇపుడు తన జీవితంలో ఏ అమ్మాయి లేదని తెలిపాడు.

తెలంగాణ అమ్మాయేనా?

తెలంగాణ అమ్మాయేనా?

తెలంగాణ అమ్మాయినే చేసుకుంటారా? అనే ప్రశ్నకు విజయ్ రియాక్ట్ అవుతూ... ఆమె తెలంగాణ అమ్మాయి అయినా, ప్రపంచంలోని మరెక్కడి అమ్మాయి అయినా తనకు కనెక్ట్ కావడమే ముఖ్యం. అపుడే ఒకరి గురించి ఒకరు తెలుసుకుని మా మధ్య ప్రేమ చిగురించడానికి అవకాశం ఉంటుంది.' అని విజయ్ తెలిపారు.

గతంలో విజయ్‌కు పెళ్లైనట్లు వార్తలు

గతంలో విజయ్‌కు పెళ్లైనట్లు వార్తలు

గతంలో అర్జున్ రెడ్డి మూవీ విడుదల ముందు విజయ్ దేవరకొండపై పెళ్లి రూమర్స్ వచ్చాయి. విజయ్ తన గర్ల్ ఫ్రెండ్ విమ్మీని పెళ్లాడబోతునట్లు పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో ఈ వార్తలపై విజయ్ సీరియస్ అయ్యారు. అప్పట్లో దీనిపై విజయ్ వ్యంగ్యంగా రియాక్ట్ అవుతూ... నా పెళ్లైంది...ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు... నా కొడుకులు రమ్మీ, డమ్మీ. ప్రెస్ వాళ్లు అన్నీ రాశారు కాని నా భార్య విమ్మీ పేరు ప్రస్తావించడం మరిచిపోయారు. నాకు విషెస్ చెప్పిన వాళ్లకు చాలా థ్యాంక్స్ అని వెటకారంగా పోస్ట్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X