స్టార్ హీరోయిన్ తో టాలీవుడ్ హీరో డేటింగ్ ? ఆ విషయాన్ని పబ్లిగ్గా ఒప్పుకుంటూ..!
సినీ ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ మాత్రమే కాదు.. రూమర్స్ కూడా సర్వసాధారణమే. ఏ హీరో హీరోయిన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ బాగుంది. పబ్లిక్ గా ఒక్కసారి కనిపిస్తే చాలు. ఎక్కడ లేని రూమర్స్ క్రియేట్ అవుతాయి. లేనిపోని పుకార్లు షికార్లు చేస్తాయి. వారిద్దరి మధ్య సంథింగ్ .. సంథింగ్.. అంటూ లేనిపోని కథనాలు వెలువడుతాయి. అలా రూమర్స్ తో నిలిచిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డేటింగ్ విషయాలను పంచుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ సంథింగ్ సంథింగ్ విషయాలు ఏంటో మీరు కూడా ఓ లుక్కేయ్యండి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డంను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న నటలలో విజయ్ దేవరకొండ ఒకడు. తాను నటించిన తొలి సినిమాలు హిట్ కొట్టిన.. ప్రస్తుతం వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల తాను నటించిన ఏ సినిమా అయినా డిజాస్టర్ గా మిగులుతుంది. ఈ రౌడీ హీరో ఎంత సక్సెస్ చూశాడో.. అంతకంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూస్తున్నాడు. ఆయన ప్రొఫెషనల్ కెరీర్ యావరేజ్ గా ఉందనే చెప్పాలి.

ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నడనీ, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ఎన్నో రోజుల నుంచి పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఈ విషయంపై ఇటు రష్మిక గానీ, అటు దేవరకొండ గానీ కన్పామ్ చేయలేదు. ఈ రూమర్స్ పై కూడా ఎప్పుడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రేమ గురించి దేవర కొండ చేసిన కామెంట్స్ గురించి చర్చ నడుస్తోంది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్ తో నటించారు. 'హీరీయే' అనే సాంగ్ తో ఓవర్ నైట్ క్రేజ్ దక్కించుకున్న సింగర్, మ్యూజిక్ కంపోజర్ జస్లీన్ రాయల్.. ఈ ఆల్బమ్ ను రూపొందించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. ఆయన జోడిగా రాధిక మదన్ నటించారు. ఇటీవల విడుదలైన ఈ ఆల్బమ్ రికార్డ్ స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే 'సాహిబా' ఆల్బమ్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రేమ, పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ.దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. విజయ్ తాను రిలేషన్ లో ఉన్నననీ, తన సహనటుల్లో ఒకరితో డేటింగ్ చేసినట్లు అంగీకరించాడు. 'నాకు 35 సంవత్సరాలు. నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? ప్రశ్నించాడు. దీంతో అక్కడ రిపోర్స్.. మీరు ఎప్పుడైనా సహనటుడితో డేటింగ్ చేశారా? అని ప్రశ్నించారు. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు వెళ్లే ముందు..తాను ఆ వ్యక్తులతో క్లోజ్ ఫ్రెండ్ షిప్ చేస్తానన్నారు. అయినా.. తాను డేట్‌లకు వెళ్లననీ, ఎవరితోనైనా చాలా కాలం ఫ్రెండ్ షిప్ ఉంటుందో వారితోనే మాత్రమే తాను బయటకు వెళ్తానని అన్నారు.
విజయ్ ప్రేమ గురించి మాట్లాడుతూ.. తనకు షరతులు లేని ప్రేమ కావాలన్నారు. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం కూడా తెలుసు. నాకు షరతులు లేని ప్రేమ తెలియదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి గురించి విజయ్ మాట్లాడుతూ.. ఇది మహిళలకు మరింత సవాలుగా ఉంటుందని, పెళ్లి అనేది ఒకరి కెరీర్‌కు మధ్య రావాల్సిన అవసరం లేదు. వివాహం అనేది మహిళలకు కష్టమనీ, ఎప్పడు మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతారనే వారి ప్రొఫెషన్ పై ఆధారపడి ఉంటుందని అన్నారు.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో విజయ్ , రష్మిక కలిసి నటించడం. వారిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వారి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోందని.. వారు డేటింగ్ ఉన్నారంటూ.. పుకార్లు వచ్చాయి. అలాగే.. వీరిద్దరూ తరచుగా సోషల్ మీడియాలో ఒకరికొకరు సపోర్టుగా పోస్టులు పెట్టుకోవడం, లైక్స్ కామెంట్స్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తున్నట్టుంది. ఇటీవల.. రష్మిక.. విజయ్ రాబోయే చిత్రం VD 12 కోసం అభినందనలు తెలియజేయగా.. పుష్ప 2 ట్రైలర్ విడుదలైన తర్వాత రష్మికను ప్రశంసించాడు విజయ్ దేవరకొండ.
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. తాత్కాలికంగా VD12 అని పిలుస్తారు. ఇందులో విజయ్ గూఢచారి పాత్రను పోషించనున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల లేదా రష్మిక మందన్న నటించబోతున్నారనే టాక్ వచ్చింది. కానీ, కొత్త హీరోయిన్ తో విజయ్ రొమాన్స్ చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి లవ్ గురించి విజయ్ దేవరకొండ ఒపెన్ అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు .


Click it and Unblock the Notifications











