కేక పుట్టిస్తోన్న విజయ్ న్యూ లుక్.. వాటి కోసం అదిరిపోయే ఫోటో షూట్..
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు. యూత్ ఐకాన్ గా మారిన విజయ్.. తనదైన స్టైల్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. ఈవెంట్ ఏదైనా సరే.. విజయ్ వస్తున్నాడంటే.. అందరి కళ్లు అతడిపైనే ఉంటాయి.

వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్..
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ ఇలా ప్రతీ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ.. తన ఫాలోయింగ్ ను పెంచకుంటూ పోతున్నాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ క్రేజ్ పెరుగుతూ పోతోంది.

అందరి కంటే భిన్నంగా..
సినిమాలో నటనే కాదు.. బయట కనబడే విధానం, మాట్లాడే తీరులోనూ అందరి కంటే భిన్నంగా కనబడే విజయ్ కి యూత్ లో ఎనలేని క్రేజ్ ఏర్పడింది. అందరిలోనే తాను ఉండే పద్దతే.. యూత్ ఐకాన్ ను చేసింది.

స్వయంగా స్టైలీష్ స్టారే అడిగేశాడు..
ఆడియో ఫంక్షన్లైనా, ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా.. విజయ్ మామూలుగా రాడు. తన డ్రెస్సులను తానే డిజైన్ చేసుకుంటానని చెబుతాడు. అలా ఓ ఈవెంట్లో విజయ్ ధరించిన దుస్తులపై టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మనసు పడ్డాడు. స్టైలీష్ స్టారే అలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చాడంటే విజయ్ చేసే రచ్చ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేక పుట్టిస్తోన్న డిఫరెంట్ లుక్..
వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నా.. తన సొంత బ్రాండ్ దుస్తులను ప్రమోట్ చేస్తుంటాడు. రౌడీ వేర్స్ అంటూ అప్పట్లో తెగ హల్చల్ చేసేశాడు. వీటి ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా చేసి అందరి ద`ష్టి ఆకర్షించాడు. తాజాగా తన బ్రాండ్ దుస్తుల కోసం ఓ ఫోటో షూట్ చేశాడు. ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లో కూడా తన మార్క్ ని చూపబోతుంది. త్వరలోని విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్' బ్రాండ్ ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ మారబోతుంది. వీటిని ప్రమోట్ చేసేందుకే తాజాగా ఫోటో షూట్ నిర్వహించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











