Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను.. టికెట్ల రేట్లపై విజయ్ దేవరకొండ పాజిటివ్ కామెంట్స్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా ప్రభావం వల్ల చాలా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కొన్ని సినిమాలకు 50% ఆక్యుపెన్స్ అనేది చాలా కఠినతరంగా మారుతున్న సమయంలో మెల్ల మెల్లగా ఆ విషయంలో ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే టికెట్ల రేట్లు విషయంపై ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎవరూ ఊహించని విధంగా చాలా పాజిటివ్ గా కామెంట్ చేశాడు.

పెద్ద సినిమాలకు..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో టికెట్ల రేట్లు అధికంగా లేకపోతే పెద్ద సినిమాలకు చాలా తీవ్రంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని పెద్ద సినిమాలకు మొదటి వారం ఎక్కువ టికెట్ల రేట్లను కేటాయిస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ లో మాత్రం..
టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఇండస్ట్రీకి మద్దతు లభిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రం ఇంకా కొత్త తరహా రేట్లు తీవ్రస్థాయిలో అసంతృప్తి గురిచేస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్స్ కు కూడా చాలా దారుణంగా 30 రూపాయల టికెట్ ను కేటాయించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణపై ప్రశంసలు
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిర్ణయించిన కొత్త టికెట్ల రేట్లు కు టాలీవుడ్ పరిశ్రమ చాలా ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచించే విధానం చాలా అర్థవంతంగా ఉంది అని సినీ ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడుతున్నారు. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు.

ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను
పరిశ్రమను ఎలా సంపన్నంగా మార్చాలో వందకు ఒక శాతం ఎక్కువగానే ప్రభుత్వం ఆలోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. తెలంగాణ సీఎం, కేటీఆర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.. ఆర్థిక వ్యవస్థ యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సును ఎల్లప్పుడూ పెంచడానికి తగినంతగా ఆలోచిస్తున్నట్లు తెలియజేశారు. ఇక నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ - దేశంలోనే అతి పెద్దది.. ధన్యవాదములు అని విజయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

లైగర్ సినిమాతో..
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎలాగైనా తనకంటూ ఒక పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని ఈ రౌడీ స్టార్ కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 80 శాతానికి పైగా షూటింగ్ అయితే పూర్తయింది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.