Vijay deverakonda Rashmika: వెకేషన్‌కి విజయ్ - రష్మిక.. మళ్లీ అడ్డంగా దొరికేశారుగా!
రౌడీ బాయ్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ హీరో క్రేజ్ పాన్ ఇండియా లెవెల్. ఒక్క పాన్ ఇండియా కొట్టకపోయినా.. దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోవైపు రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే. ఇక వీరి మధ్య ఏదో నడుస్తుందంటూ గత కొంత కాలంగా రూమర్స్ అయితే వస్తున్నాయి. తాజాగా వీరు ఒకే లొకేషన్ లో వేరువేరుగా దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే....
విజయ్ దేరవకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తునే ఉన్నాయి. రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమ తర్వాత... వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇంతలో ఏం అయిందో తెలియదు.. వీళ్ల పెళ్లి బ్రేక్ అయింది. అయితే అప్పుడే రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. రష్మిక పెళ్లి క్యాన్సిల్ కావడానికి విజయ్ దేవరకొండ అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

ఆ విషయం పక్కన బెడితే... రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తాయి. దానికి కారణం రష్మిక దిగిన ఫోటోలు.. విజయ్ దేవరకొండ దిగిన ఫోటోలు లొకేషన్ ఒక్కటే కావడం. వీరు వేరు వేరుగా ఫోటోలు దిగిన... ఒకే లోకేషన్ లో దిగుతున్నారు. దీనితో ఇది చూసిన నెటిజన్స్... వీరు ప్రేమలో ఉన్నారని.. కలిసి ఉంటున్నారని కామెంట్స్ చేస్తూ.. ఫ్రూవ్స్ సహా ఫోటోలను నెట్టింట్లో పెడుతున్నారు.
గతంలో రష్మిక విజయ్ దేవరకొండ ఫోటోలు ఎన్నో సార్లు వైరల్ గా మారాయి. విజయ్ వాడిన షర్ట్, కళ్లద్దాలు ఇలా రష్మిక తన ఫోటోల్లో ఉండటం చూసి విజయ్ రష్మిక కలిసే ఉంటున్నారని కన్ఫార్మ్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో సారి ఈ జంట అడ్డంగా బుక్ అయింది. ఆ ఫోటో లీక్ కావడంతో.. రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

టర్కీలో విహారయాత్రలో ఉన్న రష్మక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో టర్కీకి చెందినదిగా తెలుస్తోంది. ఇక అక్కడ విజయ్ దేవరకొండ తన ఇటీవల విడుదలైన ఖుషి సినిమా చిత్రీకరణలో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనితో రష్మిక కూడా ఆ సమయంలో ఆ ప్లేస్ కి వచ్చిందని నెటిజన్స్ అనుకుంటున్నారు. అయితే రష్మిక పోస్ట్ చేసిన ఫోటో.. విజయ్ దేవరకొండ కూర్చున్న టేబుల్ ఫోటో.. ఒకే విధంగా ఉండటం... అభిమానులు గమనించారు. దీంతో ఆ ఫోటోలను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అయితే రష్మిక, విజయ్ దేవరకొండ లివ్ ఇన్ ఉన్నారనే విషయం ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలతో మరోసారి బయటపడింది. ఫోటోలో, రష్మిక అద్భుతమైన చీరలో అందంగా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవ్వగా... ఆ బ్యాక్ డ్రాప్ ను గమనిస్తే.. అది విజయ్ దేవరకొండ ఫోటోలలో ఉన్న బ్యాక్ డ్రాప్ లానే ఉందని గమనించారు. అలా వీరి గుట్టు మరోసారి బయటపడింది.

విజయ్ రష్మిక చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీనితో వీరిద్దరూ నిజంగానే కలిసి ఉంటున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ.. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తే.. ఈ ప్రచారాలకు పుల్ స్టాప్ పడనుంది. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు రష్మిక యానిమల్ సినిమాతో రణబీర్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











