Vijay Deverakonda అరుదైన రికార్డు: టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఘనత
ఏమాత్రం అంచనాలు లేకుండానే హీరోగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను దక్కించుకున్న అతడు.. ఎనలేని క్రేజ్‌ను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల జాబితాలో చేరిపోయాడు. అలాగే, సోషల్ మీడియాలో సైతం ఊహించని రీతిలో ఫాలోవర్లను జత చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడీ రౌడీ స్టార్ విజయ్.
కెరీర్ పరంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన పర్సనల్ మేటర్స్‌తో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు. అలాగే, ఫొటోలు, వీడియోలు, మూవీ అప్‌డేట్లు ఇస్తున్నాడు. దీంతో అతడిని ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 12 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నాడు. తద్వారా ఇంత మంది అభిమానాన్ని అందుకున్న ఏకైక తెలుగు హీరోగా అతడు రికార్డును క్రియేట్ చేశాడు.

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీన్ని పూరీ, ఛార్మీతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబై నగరంలో జరుగుతోంది. దీన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. వినాయక చవితి కానుకగా దీన్ని సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.


Click it and Unblock the Notifications











