Vijay Devarakonda సెన్సేషనల్ రికార్డు: టాలీవుడ్‌ చరిత్రలోనే ఏకైక హీరోగా నిలిచిన రౌడీ

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను దక్కించుకున్న విజయ్.. ఎనలేని క్రేజ్‌ను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల జాబితాలో చేరిపోయాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

అదిరిపోయే హిట్లతో స్టార్ హీరోగా

అదిరిపోయే హిట్లతో స్టార్ హీరోగా

మొదటి చిత్రం 'పెళ్లి చూపులు'తో విజయ్ దేవరకొండ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది అతడి కెరీర్‌కు మంచి ఊపును తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అనంతరం 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి సక్సెస్‌లు కొట్టేశాడు.

హిట్ కోసం వేచి చూస్తోన్నాడుగా

హిట్ కోసం వేచి చూస్తోన్నాడుగా

కెరీర్ ఆరంభంలోనే భారీ సక్సెస్‌లను అందుకుని యమ జోరు చూపించాడు విజయ్ దేవరకొండ. కానీ, ఈ మధ్య కాలంలో 'నోటా', 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి వరుస ఫ్లాపులను చవి చూశాడు. దీంతో అతడితో పాటు అభిమానులు కూడా నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

పూరీ జగన్నాథ్‌తో కలిసిన రౌడీ

పూరీ జగన్నాథ్‌తో కలిసిన రౌడీ

భారీ విజయం కోసం ఎదురు చూస్తోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది.

హాలీవుడ్ రేంజ్‌.. అలాంటి రోల్

హాలీవుడ్ రేంజ్‌.. అలాంటి రోల్

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని అంటున్నారు.

అక్కడ ఫుల్ బిజీ.. యమ క్రేజ్

అక్కడ ఫుల్ బిజీ.. యమ క్రేజ్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. విజయ్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన పర్సనల్ మేటర్స్‌తో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు. అలాగే, ఫొటోలు, వీడియోలు, మూవీ అప్‌డేట్లు ఇస్తున్నాడు. దీంతో అతడికి క్రేజ్ భారీగా ఏర్పడింది.

విజయ్ ఖాతాలో అదిరే రికార్డు

విజయ్ ఖాతాలో అదిరే రికార్డు

విజయ్ దేవరకొండకు దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ హీరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 14 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నాడు. తద్వారా ఇంత మంది అభిమానాన్ని అందుకున్న ఏకైక తెలుగు హీరోగా అతడు రికార్డును క్రియేట్ చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X