ప్రభాస్, మహేష్‌లకు సాధ్యం కానీ ఫీట్.. రౌడీ స్టార్ రేంజ్ మామూలుగా లేదే!
టాలీవుడ్ సెన్సేషన్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అనతి కాలంలో స్టార్ హీరోల సరసన చేరి.. వారికంటే ఎక్కువ అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నాడు. యూత్ ఐకాన్‌గా స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. కేవలం సినిమాలతోనే ఇంతటి స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడని అనుకుంటే పొరబాటే. అతని మాటతీరు, యాటిట్యూడ్, వేదికలు ఎక్కితే ఇచ్చే ప్రసంగం, విమర్శలను తీసుకునే విధానం ఇలా ప్రతీ ఒక్కటి ఎంతో మందిని దగ్గర చేశాయి.
సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్‌గా ఉండే యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ముందుంటాడు. సినిమా ప్రమోషన్స్‌ను సోషల్ మీడియాలో వేదికపై నుంచే తనదైన శైలిలో చేసేస్తాడు. ముఖ్యంగా ఈ రౌడీ హీరోకు సోషల్ మీడియాలో మరింత ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనే వేసే ట్వీట్స్, టైమింగ్ ఇలా ప్రతీ ఒక్కటి నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. అందుకే విజయ్‌కు సౌత్ హీరోలకు దక్కని ఓ క్రెడిట్ దక్కింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు మిలియన్ల ఫాలోవర్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచాడు విజయ్ దేవరకొండ. ప్యాన్ ఇండియన్ స్టార్‌గా చెప్పుకునే ప్రభాస్ (4.5), సదరన్ స్టార్‌గా ట్యాగ్ తెచ్చుకున్న అల్లు అర్జున్(6.7), సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండే మహేష్ బాబు (4.6)లతో ఉన్న స్టార్స్‌ను విజయ్ వెనక్కి నెట్టేశాడు. అయితే ట్విట్టర్‌లో మాత్రం విజయ్ చాలా వెనకబడి ఉన్నాడు.


Click it and Unblock the Notifications











