For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vijay Devarakonda: రౌడీ సంచలన రికార్డు.. టాలీవుడ్‌లో రెండో హీరోగా ఘనత

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన వారిలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో మరింత ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే 'అర్జున్ రెడ్డి' అనే సినిమాతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలవడంతో పాటు విజయ్‌ను స్టార్‌గా మార్చేసింది. అనంతరం 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి సక్సెస్‌లనూ అందుకున్నాడు.

  సమంత అందాల ప్రదర్శన: టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటుగా!

  ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్నిఅందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రాబోతుంది. ఇప్పటికే టాకీ పార్టును పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఇక, ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇటీవలే ప్రారంభించింది.

  Vijay Devarakonda Reaches 16M Followers On Instagram

  'లైగర్' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే విజయ్ దేవరకొండ మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'జన గణ మన' అనే సినిమాను కూడా ప్రకటించాడు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసేశారు. అయితే, దీని కోసం కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయిన విజయ్.. ఇప్పుడు మాత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తన పదకొండవ సినిమా 'ఖుషి'ని చేస్తున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

  షర్ట్ విప్పేసి యాంకర్ స్రవంతి హాట్ ట్రీట్: వామ్మో మరీ ఈ రేంజ్ షోనా!

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. విజయ్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన పర్సనల్ మేటర్స్‌తో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు. అలాగే, ఫొటోలు, వీడియోలు, మూవీ అప్‌డేట్లు ఇస్తున్నాడు. దీంతో అతడికి క్రేజ్ భారీగా ఏర్పడింది. ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండకు దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ హీరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 16 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నాడు.

  విజయ్ దేవరకొండ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 16 మిలియన్ ఫాలోవర్ల సంఖ్యను చేరుకున్నాడు. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ఘనతను సొంతం చేసుకున్న రెండో హీరోగా అతడు రికార్డును నమోదు చేసుకున్నాడు. అతడి కంటే ముందు అల్లు అర్జున్ (ప్రస్తుతం అతడి ఫాలోవర్లు 18 మిలియన్లు) ఈ మార్కును చేరుకున్నాడు. ఇక, రౌడీ బాయ్ సాధించిన ఈ ఫీట్‌తో అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

  English summary
  Tollywood Star Hro Deverakonda Vijay Sai is Very Active in Social Media. Now he Reached 16 Millon Followers On Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X