twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను రెబల్ కాదు, ఏ పార్టీ అయితే ఏంటి? అది అందరికీ డేంజరే: విజయ్ దేవరకొండ

    |

    Recommended Video

    Vijay Deverakonda Joins Chorus To 'Save Nallamala Forest' || నల్లమలని కాపాడేవారికే నా మద్దతు

    ప్రపంచ వ్యాప్తంగా యూరేనియం మైనింగ్ చేసిన ప్రాంతంలో రేడియేషన్ నీటిలో కలుస్తోంది. దీని వల్ల ఆ ప్రాంతంలో ఉన్న చెట్లతో సహా జీవజాలం మొత్తం ఎఫెక్ట్ అవుతోంది. యూరేనియం అనేది ముఖ్యమే, కానీ చాలా దేశాలు దాన్ని ఎగుమతి చేస్తున్నాయి కాబట్టి కోనుగోలు చేసే వీలుంది. నల్లమల లాంటి అడువలను పోగొట్టుకుని యూరేనియం తీయాల్సిన అవసరం లేదు అంటున్నారు తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. కొన్ని రోజులుగా ఆయన #SAVENALLAMALA ఉద్యమానికి మద్దతుగా, యూరేనియం మైనింగుకు వ్యతిరేకంగా తన గళం విప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై మీడియాతో మాట్లాడారు.

    మైనింగ్ అనేది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ మనీ కానేకా

    మైనింగ్ అనేది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ మనీ కానేకా

    చాలా మంది యూరేనియం మైనింగ్ వల్ల మన దేశం పవర్ ఫుల్ అవుతుంది అని భావిస్తున్నారు. కేవలం మైనింగ్ వల్ల మనం పవర్ ఫుల్ అవ్వము, యూరేనియం మన వద్ద ఉంటే దానితో ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం? స్పేస్ రీసెర్చ్ ఎంత చేస్తున్నాం అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. ఎక్కడా కూడా మైనింగ్ అనేది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ మనీ కానేకాదు. ఐరన్ ఓర్, క్రూడ్ అయిల్ ఉత్పత్తి చేసే వారి కంటే కూడా ఆ ఐరన్ ఓర్‌తో స్టీల్ ఎవరు తయారు చేస్తారో వాడు ఎక్కువ లాభపడతాడు. క్రూడ్ ఆయిల్ తీసే వాడికంటే దాన్ని పెట్రోల్, ఇతర ఉత్పత్తులు తీసిన వారు ఎక్కువ సంపాదిస్తారు. ఇలా చేయడం వల్లనే ఎక్కువ ఎంప్లాయిమెంట్ కల్పించి ఎక్కువ మనీ సంపాదించగలం... అని విజయ్ దేవరకొండ అన్నారు.

    ఆ దేశాల్లో మైనింగ్ జరుగుతోంది, పవర్ ఫుల్ కాలేదే...

    ఆ దేశాల్లో మైనింగ్ జరుగుతోంది, పవర్ ఫుల్ కాలేదే...

    ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు యూరేనియం ఎగమతి చేస్తున్నాయి. కజకిస్థాన్ అతిపెద్ద ఎగుమతిదారు. మరి ఆదేశం పవర్ ఫుల్ దేశంగా ఉందా? లేదు కదా. నమీబియా, కాంగో లాంటి దేశాలను రా మెటీరియల్స్ కోసం వాడుతున్నారు. అన్ని దేశాలు ఆయా ప్రాంతాల నుంచి యూరేనియం తెచ్చుకుంటున్నాయి. మనకు యూరేనియం కావాలంటే ఆస్ట్రేలియా, రష్యా, కజకిస్థాన్, మంగోలియా లాంటి దేశాల నుంచి తెచ్చుకోవచ్చు.

    నేను రెబల్ కాదు

    నేను రెబల్ కాదు

    నేను యూరేనియం మైనింగ్ రెబల్ కాదు, ఇక్కడ యూరేనియం మైనింగుకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటం లేదు. నల్లమలలో యూరేనియం మైనింగ్ వద్దు అని మాత్రమే అంటున్నాం. ఇదే యూరేనియం వాటర్ టేబుల్‌కు ఎఫెక్ట్ కాకుండా మనం తాగే త్రాగునీటిపై ముఖ్యంగా ప్రభావం చూపకుండా, ఫారెస్టుకు, ప్రజలకు ఎఫెక్ట్ కాకుండా ఉంటే ఫర్వాలేదు.

    అక్కడ అయితే మనకేంటి అనుకుంటున్నారు

    అక్కడ అయితే మనకేంటి అనుకుంటున్నారు

    నల్లమలలో యూరేనియం మైనింగ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే దాన్ని మళ్లీ మనం రికవరీ చేయలేం. ఇంట్లో కూర్చుని అందరూ చాలా అంటారు. ఫ్లైఓవర్ కట్టడానికి మీ ఇంటి స్థలంలో కొంత ఇవ్వండి అంటే ఎవరూ ఇవ్వరు, కేసులు పెడతారు. హైదరాబాద్ లో చాలా ఫ్లైఓవర్లు ఇలా పెండింగులో ఉన్నాయి. కానీ ఫారెస్ట్ అంటే ఎవరూ పట్టించుకోరు. అక్కడ ఎవరు ఉన్నారు? మనకేంటి? అనుకుంటున్నారు. కానీ దాని వల్ల మనపై ప్రభావం పడుతుందని ఎవరూ ఆలోచించడం లేదు.

    ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, ప్రజల సమస్య

    ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, ప్రజల సమస్య

    నాకు నల్లమల గురించి 10 రోజుల క్రిందే తెలిసింది. కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుందట. ప్రజలే ఈ మూమెంట్ మొదలు పెట్టారు. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాట్లాడుతున్నపుడు మాకు సంతోషం ఏమిటంటే.. గవర్నమెంట్ నుంచి స్పందన రావడం. తర్వాతి రోజే కేసీఆర్ గారు మైనింగ్ రాష్ట్రంలో అనుమతించం అని రెఫరెండం పాస్ చేశారు. ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. మనందరికీ కావాల్సింది అక్కడ మైనింగ్ జరుగకూడదు. ఈ విషయంలో థాంక్స్ టు జనసేన పార్టీ, తెలంగాణ కాంగ్రెస్, ఎన్జీవోస్, టీఆర్ఎస్ పార్టీ. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.

    మన సొంత పనులు తప్ప చుట్టుపక్కల గురించి ఆలోచించడం లేదు

    మన సొంత పనులు తప్ప చుట్టుపక్కల గురించి ఆలోచించడం లేదు

    ఇది మన దేశం, మనం ఎఫెక్ట్ అవుతామని అందరూ ఆలోచించాలి. యూరేనియం మైనింగ్ జరిగితే ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మనమంతా మన సర్వైవల్ గురించే ఆలోచిస్తున్నాం. మన రెంటు కట్టాలి, మన పాలబిల్లు కట్టాలి, మన సినిమా రిలీజ్ కావాలి, హిట్టు కావాలి అనే పనులలో ఉండి చుట్టు పక్కల ఏం జరుగుతుందో చూడలేకపోతున్నాం. కేవలం కరెంటు కోసం యూరేనియం కాకుండా సోలార్ ఎనర్జీ అనేది మనం ఉపయోగించుకుంటే మంచిది.... అని విజయ్ దేవరకొండ అన్నారు.

    English summary
    Vijay Devarakonda Reacts To Uranium Issue. "20,000 acres of Nallamala is at the risk of being destroyed. We have destroyed our lakes, flooded our states, caused drought in others and polluted most of our drinking water sources. The quality of our air is deteriorating everywhere. Multiple cities are running out of the water to drink, brush, shower, wash and everything else. And we continue to justify destroying any small good that is left. Next in line are the lush green Nallamala forests," Devarakonda said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X