రష్మికకు హ్యాండిచ్చిన రౌడీ హీరో! తన రియల్ క్రష్ పేరు చెప్పి షాకిచ్చిన విజయ్ దేవరకొండ
ఎటువంటి బ్యాక్గ్రాండ్ లేకుండా, సపోర్టు లేకుండా తన యాటిట్యూడ్ అండ్ టాలెంట్‌తో ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. ఇంకా చెప్పాలంటే తన యాక్టింగ్ కన్నా యాటిట్యూడ్ అండ్ బిహేవింగ్ స్టైల్‌తోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇతడికి నేషనల్ క్రష్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ చాలా కాలంగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇతడి క్రష్ రష్మిక కాదని తెలిసిపోయింది. మరో హీరోయిన్ అంటే తనకు ఇష్టమని చెప్పాడీ రౌడీహీరో. దాని గురించే ఈ కథనం..
ఫ్యామిలీ స్టార్ సినిమాతో: వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి ఖాతాలో హిట్లు తక్కువే అయినా క్రేజ్ మాత్రం ఫుల్ ఎక్కువ. అర్జున్ రెడ్డితో వెలుగులోకి వచ్చిన అతడు ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ క్రామ్రేడ్ చిత్రాలతో బాగా ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత లైగర్ వరకు చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. రీసెంట్‌గానే ఖుషితో హిట్ అందుకున్న ఆయన త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

విజయ్ - రష్మిక కెమిస్ట్రీ వేరే లెవల్: అయితే ఆన్‌స్క్రీన్‌లో విజయ్ - రష్మిక కెమిస్ట్రీ వేరే లెవల్ అనే ఫీలింగ్‌లో ఉంటారు అభిమానులు. ఈ ఇద్దరి మధ్య బయట కూడా సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉన్నట్లు తెగ ప్రచారం సాగుతోంది. చాలా సందర్భాల్లోనూ ఈ జంట తమ అనుబంధం ఎంత గట్టిదో వివరించారు. కానీ తామిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక విజయ్ - రష్మిక తర్వాత విజయ్ - సమంత కెమిస్ట్రీ కూడా చాలా మందికి బాగా ఆకట్టుకుంది. ఒక దశలో కొంపతీసి వీరిద్దరి మధ్య ఏమైనా ఉందా అన్న డౌట్లు కూడా పడ్డారు నెటిజన్లు.

రష్మికకు హ్యాండిచ్చి: ఏదిఏమైనా ఆ తర్వాత విజయ్‌కు రష్మిక అంటే బాగా ఇష్టమని, తనే ఇతడి క్రష్ అంతా ఫిక్సైఫోయారు. కానీ విజయ్ మాత్రం తన క్రష్ ఎవరు అని అడిగితే రష్మిక పేరు చెప్పకుండా షాక్ ఇచ్చారు. హీరోయిన్ సమంతనే తన క్రష్ అని చెప్పారు. "సమంత సూపర్ లవ్లీగా ఉంటుంది.
మహానటిలో కలిసి నటించాం అని గుర్తుకొచ్చినప్పుడల్లా తనతో నటించడం గొప్పగా అనిపిస్తుంది. ఏమాయ చేశావే సినిమా చూసినప్పుడు తనే నా క్రష్ అయిపోయింది. తొలిసారి సామ్‌ను చూసినప్పుడు, ఆమె బాల్కానీలో ఉంది. తనను చూసి ఈ హృదయం కరిగించి వెళ్లకే పాటను పాడుకున్నాను" అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.
బిజీ బిజీగా: ఇకపోతే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికొస్తే ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. గీతాగోవిందం డైరెక్టర్ పరశురామ్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సమంత అయితే ఏడాది బ్రేక్ తర్వాత రీసెంట్‌గానే ప్రొఫెషనల్ లైఫ్‌లోకి అడుగుపెట్టింది. త్వరలోనే ఇండియన్ సిటాడెల్ వెబ్‌సిరీస్‌తో ఆడియెన్స్‌ను పలకరించనుంది. ప్రస్తుతానికైతే ఆమె చేతిలో ఏం సినిమాలు లేవు.


Click it and Unblock the Notifications











