Vijay Devarakonda: మైక్​ టైసన్​ నన్ను బూతులు తిట్టేవాడు.. అలా చూస్తే భయపడిపోతాడు.. విజయ్​ దేవరకొండ కామెంట్స్

టాలీవుడ్ డేరింగ్​ అండ్​ మాస్​ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు పూరీ జగన్నాథ్. ఆయన సినిమాలకు ఓ సెపరేట్​ ఫ్యాన్​ బేస్ ఉంది. జయాపజయాల సంగతి పక్కన పెట్టి ఆయన డైలాగ్స్​, స్క్రీన్​ ప్లేకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురిచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యాటిట్యూడ్​తో అర్జున్​ రెడ్డిగా అతి తక్కువ కాలంలోనే ఒక స్పెషల్​ ఇమేజ్​ సంపాదించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్​లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం లైగర్​. ఈ సినిమాలో బాక్సింగ్​ లెజండరీ మైక్​ టైసన్ నటిస్తున్నాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి లైగర్​పై బజ్​ క్రియేట్​ అయింది. అయితే ప్రస్తుతం మైక్​ టైసన్​పై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వైరల్​ అవుతున్నాయి.

లైగర్​ మూవీని ప్రముఖ బాలీవుడ్​ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఒక్కొక్కరు ఒక్కోలా..

ఒక్కొక్కరు ఒక్కోలా..

ఎట్టకేలకు అత్యంత భారీ అంచనాల మధ్య పాన్​ ఇండియా మూవీగా ఆగస్టు 25న విడుదలైంది లైగర్​ చిత్రం. రిలీజైన తొలి రోజు నుంచే మూవీపై నెగెటివ్​ టాక్​ వచ్చింది. ఈ మూవీపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. తాజాగా తనపై విరుచుకుపడిన మరాఠా మందిర్​ థియేటర్ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ మనోజ్​ దేశాయ్​ను విజయ్​ దేవరకొండ కలిసిన విషయం తెలిసిందే.

మరిచిపోలేనే రెస్పాన్స్​..

మరిచిపోలేనే రెస్పాన్స్​..


ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు లైగర్​ ఎంతో క్రేజ్​ సంపాదించుకుంది​. అందుకు కారణం ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్​, ట్రైలర్​ ఇలా అన్నింటికి సూపర్బ్​ రెస్పాన్స్​ వచ్చింది. అంతకుమించి వివిధ రాష్ట్రాల్లో చిత్రబృందానికి వచ్చిన స్పందన మరిచిపోలేం.

విజయ్​ చెప్పిన డైలాగ్​..

విజయ్​ చెప్పిన డైలాగ్​..

అంతేకాకుండా ప్రమోషన్స్​లో భాగంగా వరంగల్​లో ఫ్యాన్​డమ్​ ఈవెంట్​ను చాలా గ్రాండ్​గా ఏర్పాటు చేశారు. గుంటూరులో ప్రీ రిలీజ్​ ఈవెంట్​ అభిమానుల కోలాహలం, సందడి మధ్య సూపర్​ సక్సెస్​ అయింది. ఈ ప్రమోషన్స్​లలో ఆగస్టు 25న ఇండియా షేక్​ అవుతుంది అని విజయ్​ చెప్పిన డైలాగ్​ గుర్తుండే ఉంటుంది.

మైక్​ టైసన్​ గురించి..

మైక్​ టైసన్​ గురించి..


కాగా ఈ చిత్రంలో బాక్సింగ్​ లెజండరీ మైక్​ టైసన్ గెస్ట్ రోల్​లో నటించిన విషయం తెలిసిందే. మైక్​ టైసన్​ గురించి విజయ్​ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్​ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మైక్​ టైసన్​ తనను తిట్టాడని చెప్పుకొచ్చాడు విజయ్​ దేవరకొండ.

బూతులు తిట్టేవాడు..

బూతులు తిట్టేవాడు..

''మైక్​ టైసన్ నన్ను చాలా సందర్భాల్లో తిట్టాడు. ఇప్పుడు ఆ బూతుల్ని చెప్పాలనుకోవట్లేదు. ఆయన ప్రేమతోనే ఆ బూతులు తిట్టేవాడు. ఇండియా అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇక్కడి ఆహారం, మ్యూజిక్​ను ఆయన ఎంతో ఎంజాయ్​ చేస్తాడు.

అలా చూస్తే భయపడిపోతాడు..

అలా చూస్తే భయపడిపోతాడు..


కానీ అధిక సంఖ్యలో మనుషుల్ని చూస్తే మాత్రం భయపడిపోతాడు. ఓసారి ఆయన ఇండియాకు వచ్చినప్పుడు అతన్ని చూసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. అది చూసిన మైక్​ టైసన్​ హోటల్​ నుంచి బయటకు రాలేదు'' అని విజయ్​ దేవరకొండ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X