Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Vijay Devarakonda: మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టేవాడు.. అలా చూస్తే భయపడిపోతాడు.. విజయ్ దేవరకొండ కామెంట్స్
టాలీవుడ్ డేరింగ్ అండ్ మాస్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు పూరీ జగన్నాథ్. ఆయన సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జయాపజయాల సంగతి పక్కన పెట్టి ఆయన డైలాగ్స్, స్క్రీన్ ప్లేకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురిచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యాటిట్యూడ్‌తో అర్జున్ రెడ్డిగా అతి తక్కువ కాలంలోనే ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమాలో బాక్సింగ్ లెజండరీ మైక్ టైసన్ నటిస్తున్నాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి లైగర్‌పై బజ్ క్రియేట్ అయింది. అయితే ప్రస్తుతం మైక్ టైసన్‌పై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
లైగర్ మూవీని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఒక్కొక్కరు ఒక్కోలా..
ఎట్టకేలకు అత్యంత భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 25న విడుదలైంది లైగర్ చిత్రం. రిలీజైన తొలి రోజు నుంచే మూవీపై నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. తాజాగా తనపై విరుచుకుపడిన మరాఠా మందిర్ థియేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్‌ను విజయ్ దేవరకొండ కలిసిన విషయం తెలిసిందే.
మరిచిపోలేనే రెస్పాన్స్..
ఇదిలా
ఉంటే
సినిమా
విడుదలకు
ముందు
లైగర్
ఎంతో
క్రేజ్
సంపాదించుకుంది.
అందుకు
కారణం
ఈ
సినిమా
నుంచి
వచ్చిన
పోస్టర్లు,
టీజర్,
సాంగ్స్,
ట్రైలర్
ఇలా
అన్నింటికి
సూపర్బ్
రెస్పాన్స్
వచ్చింది.
అంతకుమించి
వివిధ
రాష్ట్రాల్లో
చిత్రబృందానికి
వచ్చిన
స్పందన
మరిచిపోలేం.
విజయ్ చెప్పిన డైలాగ్..
అంతేకాకుండా ప్రమోషన్స్‌లో భాగంగా వరంగల్‌లో ఫ్యాన్డమ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం, సందడి మధ్య సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రమోషన్స్లలో ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుంది అని విజయ్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది.
మైక్ టైసన్ గురించి..
కాగా
ఈ
చిత్రంలో
బాక్సింగ్
లెజండరీ
మైక్
టైసన్
గెస్ట్
రోల్లో
నటించిన
విషయం
తెలిసిందే.
మైక్
టైసన్
గురించి
విజయ్
దేవరకొండ
చేసిన
వ్యాఖ్యలు
ప్రస్తుతం
వైరల్
అవుతున్నాయి.
ఓ
ఇంటర్వ్యూలో
మైక్
టైసన్
తనను
తిట్టాడని
చెప్పుకొచ్చాడు
విజయ్
దేవరకొండ.
బూతులు తిట్టేవాడు..
''మైక్ టైసన్ నన్ను చాలా సందర్భాల్లో తిట్టాడు. ఇప్పుడు ఆ బూతుల్ని చెప్పాలనుకోవట్లేదు. ఆయన ప్రేమతోనే ఆ బూతులు తిట్టేవాడు. ఇండియా అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇక్కడి ఆహారం, మ్యూజిక్‌ను ఆయన ఎంతో ఎంజాయ్ చేస్తాడు.
అలా చూస్తే భయపడిపోతాడు..
కానీ
అధిక
సంఖ్యలో
మనుషుల్ని
చూస్తే
మాత్రం
భయపడిపోతాడు.
ఓసారి
ఆయన
ఇండియాకు
వచ్చినప్పుడు
అతన్ని
చూసేందుకు
ప్రజలు
గుంపులు
గుంపులుగా
ఎగబడ్డారు.
అది
చూసిన
మైక్
టైసన్
హోటల్
నుంచి
బయటకు
రాలేదు''
అని
విజయ్
దేవరకొండ
తెలిపాడు.