ఏయ్.. విజయ దేవరకొండ.. ఏమిటా పని? ఫారిన్ గర్ల్‌ఫ్రెండ్‌తో..
Recommended Video

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో క్రేజీ స్టార్‌గా మారాడు విజయ్ దేవరకొండ. దక్షిణాదిలో ఇప్పుడు విజయ్ అంటే నిర్మాతలకు కొంగు బంగారంగా మారింది. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న ఈ హీరో చేసే కామెంట్లు సినీ, ప్రేక్షక వర్గాల్లో ట్రెండింగ్ మారుతుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఓ విదేశీ భామతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్‌లో స్వైర విహారం చేస్తున్నాయి. ఈ ఫోటోలు ఇవే..

ఫారిన్ గర్ల్‌ఫ్రెండ్‌తో
విజయ్ దేవరకొండ ఓ విదేశీ భామతో అఫైర్ కొనసాగిస్తున్నాడనే అడపాదడపా వినిపిస్తున్నాయి. కాకపోతే అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి. కానీ తాజాగా ఈ ఫోటోలు వెలుగులోకి రావడంతో నిజమేనా అనే అనుమానం కలిగింది.

అర్జున్‌రెడ్డికి ముందు
అయితే ఫారిన్ గర్ల్ ఫ్రెండ్‌తో దిగినవి కావు. అవి అర్జున్ రెడ్డికి ముందు చేసిన ఓ ఫోటోషూట్ అని పేర్కొంటున్నారు. అసలు ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ.. విజయ్ దేవరకొండ ఫొటోలు మాత్రం ట్రెండింగ్‌గా మారాయి.

నోటా, డియర్ కామ్రెడ్ చిత్రంలో
ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరీర్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న నోటా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా మైత్రీ మూవీస్, బిగ్‌బెన్ బ్యానర్‌పై రూపొందే డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు.

యాత్రలో వైఎస్ జగన్‌గా
తాజాగా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రంలో వైఎస్ జగన్ పాత్రను విజయ్ దేవరకొండ పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం కోసం విజయ్‌కు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











