విజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్.. అల్లు అర్జున్ తర్వాత టాలీవుడ్ నుంచి అతడే.!
చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించి.. రెండు హిట్లతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. తక్కువ కాలంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న అతడు.. క్రమంగా మార్కెట్‌ను కూడా పెంచుకుంటున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా స్టార్‌డమ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఖాతాలో ఓ అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. దీంతో అల్లు అర్జున్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఆ వివరాలు మీకోసం.!

అంచనాలు లేనప్పుడు అలా.. ఇప్పుడిలా.!
‘పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. అతడిపై ఏమాత్రం అంచనాలు లేని సమయంలో ఈ మూవీతో మొదటి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం' వంటి సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, స్టార్‌డమ్ వచ్చిన తర్వాత మాత్రం వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు.

నలుగురు లవర్లతో కలిసి వచ్చిన దేవరకొండ
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లె లైట్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా గత ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విజయ్‌కు మరోసారి షాకిచ్చిన ప్రేక్షకులు
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్'కు తెలుగు ప్రేక్షకులు షాకిచ్చారు. ఫలితంగా ఈ సినిమా విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయితే, ఇందులో అతడి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్‌తో కలిసి అతడు చేసిన ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది.

విజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు పడుతోన్న విజయ్ ఖాతాలో తాజాగా ఓ రికార్డ్ వచ్చి చేరింది. బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అక్కడ మాత్రం ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇండియన్ ట్రెండింగ్ మూవీస్ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచింది.

అల్లు అర్జున్ తర్వాత టాలీవుడ్ నుంచి అతడే.!
నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో' మాత్రమే టాప్ -10 జాబితాలో చోటు సంపాదించింది. ఈ మూవీ ఏకంగా మొదటి స్థానాన్ని కూడా అందుకుంది. దీని తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్' ఈ జాబితాలోకి వచ్చింది. విజయ్ సినిమాకు ఈ రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Recommended Video

హిట్ కోసం సరికొత్త అవతారంలోకి విజయ్
‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' వంటి పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలో నటిస్తున్నాడు. ఫైటింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీని పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అనన్య పాండే హీరోయిన్. ‘ఫైటర్', ‘లైగర్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











